Atchannaidu: సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు.
ABN, Publish Date - Mar 10 , 2024 | 10:32 AM
శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)లు అధికారం చేపడతాయని, వైసీపీ (YCP) కుక్కలు, సీఎం జగన్ (CM Jagan) పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ‘జగన్‌కు ఒక్కటే అడుగుతున్నాను..సమాధానం చెప్పు.. నీ తండ్రి కాంగ్రెస్‌లో ఉండగా టీఆర్ఎస్ (TRS), కమ్యూనిస్టులతో (CPI, CPM) ఎందుకు పొత్తు పెట్టుకున్నారని’ ప్రశ్నించారు. టీడీపీ అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని, పొత్తు చారిత్రాత్మక అవసరం అని, రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవటానికి పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు అర్ధం చేసుకున్న అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు పొత్తుకు వెళ్లారన్నారు. వైసీపీ పతనం ఖాయమని, టీడీపీ టికెట్ల కోసం అభ్యర్థులు క్యూ కడుతున్నారన్నారు.
వైసీపీలో పోటీ చేసే అభ్యర్థులు కారువయ్యారని, కుర్చీకి మూడు కాలు ఉంటే పడిపోతుందని విజయసాయిరెడ్డి అంటున్నారని, ‘మా కుర్చీ వైసీపీ కుర్చీని మడత పెట్టేయటం ఖాయమని.. వైసీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని’ అచ్చెన్నాయుడు అన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, కానీ ప్రజల డబ్బు తీసుకుని వైసీపీకి ఊడిగం చేస్తే ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవని జగన్ కొత్త నాటకం ఆడుతున్నారని, జగన్‌కు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సంక్షేమానికి పేటెంట్ హక్కు టీడీపీదేనని.. సంక్షేమం ఎలా ఇస్తారని వైసీపీ మమ్మల్ని అడుగుతోందని.. జగన్‌కు బుర్ర లేదు...చంద్రబాబుకు (Chandrababu) బుర్ర ఉందని అన్నారు. తమ నాయకుడు విజన్ ఉన్న నాయకుడని, పెట్టుబడులు తెచ్చే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Updated Date - Mar 10 , 2024 | 10:36 AM