ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srikakulam: అరసవెల్లి రథసప్తమి వేడుకలపై మంత్రి సమీక్ష.. వివరాలు ఇవే..

ABN, Publish Date - Dec 23 , 2024 | 02:08 PM

రథసప్తమి వేడుకలకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు ఏవిధంగా తీసుకోవాలనే అంశాలపై అధికారులను మంత్రి అచ్చెన్న సూచనలు చేశారు. ఈ సందర్భంగా అరసవెల్లి అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన తెలిపారు.

Minister Kinjarapu Atchannaidu

శ్రీకాకుళం: అరసవెల్లి రథసప్తమి (Rathasapthami) వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు. దేశంలోనే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి (Suryanarayana Swamy) ఆలయం ప్రసిద్ధి చెందిందని, అందుకే రథసప్తమి వేడుకలను మూడ్రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్షా సమావేశం నిర్వహించారు.

బెనిఫిట్‌ షోలపై ఎమ్మెల్యే సత్యనారాయణ ఏమన్నారంటే..


రథసప్తమి వేడుకలకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు ఏవిధంగా తీసుకోవాలనే అంశాలపై అధికారులను మంత్రి అచ్చెన్న సూచనలు చేశారు. ఈ సందర్భంగా అరసవెల్లి అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకానికి అరసవెల్లి ఆలయాన్ని ఎంపిక చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

Kadapa: ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి


సమీక్ష అనంతరం అధికారులతో కలిసి స్వామివారికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, 04 ఫిబ్రవరి, 2025 నుంచి మూడ్రోజులపాటు రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు, మంత్రులు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్

విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా..: సోమిరెడ్డి

Updated Date - Dec 23 , 2024 | 02:19 PM