ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

ABN, Publish Date - Sep 17 , 2024 | 12:45 PM

Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.

Union Minister Rammohan Naidu

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17: విజయవాడ వరదలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (CM Chandrababu Naidu) ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.

Anitha: వాళ్లు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్.. హోంమంత్రి సంచలన కామెంట్స్


ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఓ సామాన్యుడిలా ఇంటింటికి వెళ్లి అందరినీ కలిసి భరోసా ఇచ్చారన్నారు. యువకులమైన తమకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేశారని.. అందరి తరపున ఆయనకు కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆ వయసులో కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి దొరకడం ఏపీ ప్రజల అదృష్టమన్నారు.

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన


చంద్రబాబు ఇంతగా కష్టపడుతుంటే...ప్రతిపక్షాలు మాత్రం ఇంకా రాజకీయమే చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో మానవతా దృక్పథంతో అందరూ కలిసికట్టుగా రావాలని.. కానీ ప్రతిపక్షం వాళ్లు మాయ మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వాళ్లు ఏమి చేసినా పప్పులు ఉడకటం లేదు కాబట్టి సహించుకోలేకపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రజలు వాళ్లకు చూపించారన్నారు. అయినా ఇంకా వాళ్ళ స్టైల్ మార్చుకోకుండా రాజకీయాలు చేస్తూ ఉంటే ఆ 11 కూడా వాళ్లకు ఉంటాయో లేదో డౌట్‌గా ఉంది అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Ganta: ఐదేళ్లు స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారు?.. వైసీపీకి సూటి ప్రశ్న

Anitha: వాళ్లు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్.. హోంమంత్రి సంచలన కామెంట్స్

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 12:50 PM

Advertising
Advertising