AP Politics: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజును కలిసిన సుమన్.. ఎందుకంటే..?
ABN, Publish Date - Mar 30 , 2024 | 09:20 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కులం, మతం, వర్ణ బేధాలు చూడకుండా నిజాయతీగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని సినీనటుడు సుమన్ (Suman) అన్నారు. శనివారం నాడు బీజేపీ (BJP) ఉపాధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju)ను సుమన్ కలిశారు.
విశాఖపట్నం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కులం, మతం, వర్ణ బేధాలు చూడకుండా నిజాయతీగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని సినీనటుడు సుమన్ (Suman) అన్నారు. శనివారం నాడు బీజేపీ (BJP) ఉపాధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju)ను సుమన్ కలిశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. విష్ణుకుమార్ రాజును కలవడం ఎంతో సంతోషంగా ఉందని...ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. ఉత్తర నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పని చేసి అందరి మన్ననలు పొందారని తెలిపారు.
AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?
మరోసారి మళ్లీ పోటీ చేస్తున్నారని ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజలు చాలా తెలివైన వారని నిఘావర్గాలకు కూడా అందని తీర్పు ఎన్నికల్లో ఇవ్వగలరని చెప్పారు. ప్రజల అవసరాలు , ఆకాంక్షలను గుర్తించే నాయకులనే ఈ ఎన్నికల్లో ఎన్నుకోవాలని సూచించారు. ఒడిశా సీఎం గా నవీన్ పట్నాయిక్ ఐదుపర్యాయాలు సేవలు అందించారని తెలిపారు. విష్ణుకుమార్ రాజు మళ్లీ బరిలోకి దిగుతున్నారని అలాంటి నాయకుడినే ఎన్నికల్లో గెలిపించాలని సుమన్ కోరారు.
AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2024 | 09:27 PM