Pinnelli: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ
ABN, Publish Date - Jun 03 , 2024 | 07:25 AM
పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బాధితుడైన నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బాధితుడైన నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. మే 13న జరిగిన పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. ఈవీఎం పగలకొట్టిన ఘటనలో ఈ నెల 6 వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయవద్దన్న హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.
Chandrababu : గెలుస్తున్నాం.. రేపంతా జాగ్రత్త!
పోలింగ్ రోజు హింసకు పాల్పడిన ఎమ్మెల్యే.. కౌంటింగ్ రోజు కూడా పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలను పగలగొట్టిన కొట్టిన ఘటనపై శేషగిరిరావు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం పగలకొట్టిన ఘటనలో పక్కా సాక్ష్యాలు ఉన్నా.. సీసీటీవీ రికార్డు ఉన్నా... స్థానిక వీఆర్ఓ ఎమ్మెల్యే పేరు, ఆయన అనుచరుల పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారని సుప్రీంకోర్టుకు శేషగిరిరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారని పిర్యాదులో పేర్కొంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా శేషగిరిరావు వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని తెలిపారు.
హత్యాయత్నం, ఈవీఎంలను పగలకొట్టిన ఘటనలు రెండూ తీవ్రమైనవి అయినా... బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తున్నాయని పిటిషన్లలో శేషగిరిరావు వాపోయాడు. ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉన్నందున... తనకు భద్రత కల్పించాలని, రెండు కేసుల్లో ఇచ్చిన అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎవరూ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. పిన్నెల్లి లేకపోయినా... ఆయన ఏజంట్ ద్వారా అయినా కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించే అవకాశం ఉందన్నారు. పిన్నెల్లి స్వయంగా... కౌంటింగ్ దగ్గర ఉంటే మళ్ళీ హింస ప్రజ్వరిల్లే ప్రమాదం ఉందని శేషగిరిరావు పేర్కొన్నారు.. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక భయానక వాతావరణం నెలకొని ఉందని, పిన్నెల్లి బయట ఉంటే.. అంది ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయట ఉంటే ఈ నెల 4న మాచర్ల అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికే ప్రమాదం ఉందన ఆందోళన వ్యక్తం చేశారు. శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్ల పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
Read more AP News and Telugu News
Updated Date - Jun 03 , 2024 | 07:25 AM