ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా!

ABN, Publish Date - Jun 30 , 2024 | 03:32 AM

అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్‌ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది.

  • జగన్‌ ధ్వంస రచనను సరిచేస్తూ అమరావతిలో నిర్మాణ ప్రక్రియ

  • ప్రభుత్వ కాంప్లెక్స్‌ భూముల నోటిఫై.. 1,575 ఎకరాలకు సీఆర్‌డీఏ గెజిట్‌

  • మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు శ్రీకారం.. రాజధానిపై సర్కారు తొలి అడుగు

  • మాస్టర్‌ ప్లాన్‌ కు జగన్‌ పాలనలో తూట్లు.. గ్రామ ప్రత్యేకాధికారులకు బెదిరింపులు

  • ఆ తీర్మానాలతో మాస్టర్‌ ప్లాన్‌కు సవరణలు.. జోన్‌ రూల్స్‌ మార్చి ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు

  • రాజధాని విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌ బలోపేతంపై దృష్టి

  • జగన్‌ ధ్వంస రచనను సరిచేస్తూ అమరావతిలో నిర్మాణ ప్రక్రియ

  • ప్రభుత్వ కాంప్లెక్స్‌ భూముల నోటిఫై

  • సీఆర్‌డీఏ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

  • మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు శ్రీకారం

  • రాజధానిపై సర్కారు తొలి అడుగు

విజయవాడ, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్‌ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది. దీనిలో భాగంగా అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ శనివారం సీఆర్‌డీఏ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న 1,575 ఎకరాలను నోటిఫై చేశారు. ఈ మేరకు సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 39 ప్రకారం కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ బహిరంగ ప్రకటన జారీ చేయటంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం గత టీడీపీ ప్రభుత్వం 1,375 ఎకరాలను కేటాయించగా.. తాజాగా మరో 200 ఎకరాలను పెంచి నోటిఫై చేశారు. ఈ ప్రాంతంలో గత టీడీపీ హయాంలో ఇంటీరీయం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఐజీసీ), అసెంబ్లీ నిర్మాణాలను చేపట్టింది. వీటితో పాటు రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసంతో పాటు పలు కీలకమైన భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే సచివాలయం కూడా ఉంది. మొత్తం 5 టవర్లను నిర్మించటానికి గతంలో ప్రణాళికలు రూపొందించారు. వీటిలో రెండు టవర్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విధ్వంసానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో అమరావతిలోని ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతంపైనే టార్గెట్‌ పెట్టారు. ప్రభుత్వ పరిపాలనా భవన నిర్మాణాలను కొనసాగకుండా చేస్తూ.. అప్పటి వరకు 25 శాతం కూడా పురోగతి లేని పనులను నిలుపుదల చేశారు. ఈ ఆదేశాల వెనుక శాశ్వత ప్రాతిపదికన నిర్మించే భవనాల పనులను నిలిపివేయాలన్నదే జగన్‌ కుట్ర అని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే సచివాలయానికి సంబంధించి 5 టవర్లను నిర్మించకుండా తొక్కి పెట్టేందుకే 25 శాతం పురోగతి లేదన్న సాకుతో.. అమరావతిపై జగన్‌ వేటు వేశారు. శాశ్వత రాజధాని నిర్మాణాలలో భాగంగా మొత్తం ఐదు జీఏడీ టవర్లను 40 నుంచి 45 అంతస్థుల మేర నిర్మించాల్సి ఉంది. వాటిని కూడా జగన్‌ తన నిర్ణయాలతో సమాధి చేశారు. టీడీపీ హయాంలో రెండు జీఏడీ టవర్లను రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో చేపట్టారు. వాటిని కూడా నిలుపుదల చేయించారు. గత టీడీపీ హయాంలో దాదాపు 70 నుంచి 80 శాతం పనులు పూర్తి చేసుకున్న అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలతో పాటు, ఏన్‌జీవో భవనాల పనులను కూడా నిలుపుదల చేయించారు.

మాస్టర్‌ ప్లాన్‌కు తూట్లు

అమరావతిపై కత్తికట్టిన జగన్‌.. రాజధాని అభివృద్ధికి కీలకమైన మాస్టర్‌ ప్లాన్‌ కే తూట్లు పొడిచారు. దీనిని ఇష్టానుసారంగా మార్చారు. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను మార్చాలంటే ముందుగా ఆయా గ్రామ పంచాయతీల తీర్మానాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. స్థానికంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదన్న సాకుతో ఆయా గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారుల నిర్ణయాలను అమలు చేస్తూ మాస్టర్‌ ప్లాన్‌ సవరణలకు తెరదీశారు. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోతే గ్రామ సభలు నిర్వహించి ప్రజాభ్రిపాయాన్ని తీసుకోవాల్సింది పోయి.. ప్రత్యేకాధికారులపై ఒత్తిడిపెట్టి అనుకూలంగా తీర్మానాలు రాయించుకున్నారు. వాటి ఆధారంగా మాస్టర్‌ ప్లాన్‌కు సవరణలు చేశారు. జోనింగ్‌ రెగ్యులేషన్స్‌ మార్చాలన్న కుట్రతోనే జగన్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ సవరణకు పూనుకొందన్న విమర్శలు వినిపించాయి. భూములు అమ్ముకునేందుకు, టౌన్‌షిప్పులకు ఇచ్చుకునేందుకు వీలుగా రియల్‌ ఎస్టేట్‌ ప్రణాళికలతో మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ను అడ్డగోలుగా మార్చివేసి ఆర్‌-5 జోన్‌ తీసుకువచ్చారు. ఇలా రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను చెడగొట్టేందుకు అప్పటి సీఎం జగన్‌ ఏకపక్షంగా వ్యవహరించారు.

Updated Date - Jun 30 , 2024 | 03:33 AM

Advertising
Advertising