ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: సంచలన సర్వే.. ఏపీలో నెక్ట్స్ అధికారం వీరిదే..

ABN, Publish Date - Mar 15 , 2024 | 04:13 AM

: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించబోతోందని తాజా సర్వేలు వెల్లడించాయి.

Andhra Pradesh

  • రాష్ట్రంలో 20 లోక్‌సభ సీట్లలో ఎన్డీయే విజయభేరి

  • అధికార వైసీపీకి ఐదు స్థానాలే

  • సీ-వోటర్‌-ఏబీపీ సర్వేలో వెల్లడి

  • నెట్‌వర్క్‌-18 సర్వేలో వైసీపీకి 7 సీట్లు

  • టీడీపీ కూటమికి 18 స్థానాలు

  • జగన్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత!

అమరావతి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే(NDA) కూటమి భారీ విజయం సాధించబోతోందని తాజా సర్వేలు వెల్లడించాయి. సీ-వోటర్‌ సంస్థతో కలిసి ఏబీపీ చానల్‌ ఓ సర్వే నిర్వహించగా.. నెట్‌వర్క్‌18 (న్యూస్‌18) మెగా ఒపీనియన్‌ పోల్‌ జరిపింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు చానళ్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేల ఫలితాలను గురువారం విడుదల చేశాయి. సీ-వోటర్‌-ఏబీపీ చానల్‌ సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనుంది. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7 శాతం ఓట్లు.. వైసీపీకి 41.9 శాతం ఓట్లు.. కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమికి మూడు శాతం ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది.

టీడీపీ-జనసేన కూటమి, బీజేపీ మధ్య మార్చి మొదటివారంలో పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. నెట్‌వర్క్‌ 18 సర్వే కూడా టీడీపీ కూటమికి ఘన విజయం దక్కబోతోందని అంచనా వేసింది. ఈ కూటమికి ఏకంగా 50 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. వైసీపీకి 41 శాతం ఓట్లు, కాంగ్రెస్‌ కూటమికి ఆరు శాతం ఓట్లు, ఇతరులకు మూడు శాతం రావచ్చని అంచనా వేసింది. ఈ ప్రకారం టీడీపీ కూటమికి 18 ఎంపీ సీట్లు, వైసీపీకి ఏడు వస్తాయని వివరించింది. కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని పేర్కొంది. ఈ రెండు సర్వేల్లో ప్రజాభిప్రాయం ఇంచుమించుగా ఒకే విధంగా ఉండడం విశేషం.

ఇదికూడా చదవండి: ఏపీలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే విజయం.. తేల్చేసిన సర్వేలు

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే టీడీపీ కూటమి ఘన విజయం దిశగా వెళ్తోందని విశ్లేషించాయి. గత కొంతకాలంగా పలు సర్వేలు వచ్చినా టీడీపీ కూటమికి 20 సీట్లు వస్తాయని వెల్లడించిన తొలి సర్వే సీ-వోటర్‌-ఏబీపీదే. గత లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు రాగా.. టీడీపీకి మూడే వచ్చాయి (వేర్వేరుగా పోటీచేసిన జనసేన, బీజేపీ, కాంగ్రె్‌సలకు ఒక్కటి కూడా రాలేదు). వైసీపీ 49.1 శాతం, టీడీపీ 39.2 శాతం ఓట్లు పొందగా.. ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్‌ 1.29ు, బీజేపీ 0.96ు ఓట్లు సాధించాయి. నోటాకు వీటి కంటే ఎక్కువగా 1.49 శాతం ఓట్లు రావడం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 10:43 AM

Advertising
Advertising