ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: ఆ మాట నేను చెప్పాకే పెన్షన్లు ఇస్తున్నారు.. వైసీపీ సర్కార్‌ను ఏకిపారేసిన చంద్రబాబు

ABN, Publish Date - Apr 05 , 2024 | 02:56 PM

Andhrapradesh: పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ది పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

Nara Chandrababu Naidu

తూర్పుగోదావరి, ఏప్రిల్ 5: పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ది పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YSRCP) స్వార్థ ప్రయోజనాల కోసం పింఛన్లకు ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లను దారి మళ్ళించారని ఆరోపించారు. మార్చి 30న ఎన్నికల కమిషన్ పింఛన్ల విషయంలో ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని.. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు.

TDP: విజయవాడ రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలు ఇవే.. బయటపెట్టిన టీడీపీ


వైసీపీ ప్రభుత్వం కావాలని పింఛన్ల విషయంలో వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సైకో ముఖ్యమంత్రి వృద్ధులను ఇబ్బందిపెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. శవ రాజకీయాలు వైసీపీ డీఎన్ఏలో ఉన్నాయని విరుచుకుపడ్డారు. జూలైలో ఏప్రిల్ నుంచి మూడు నెలల పింఛన్లు ఒకేసారి ఇస్తానని నేను ప్రకటించటంతో ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారన్నారు. ఏ ప్రాంతంలో ఉన్న పింఛన్లు తీసుకునే సదుపాయం ఉందన్నారు. పింఛన్ల విషయంలో పేదలు ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి వైదొలగాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ కూడా జగన్‌పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.


ఇవి కూడా చదవండి..

వాషింగ్ మెషిన్‌లా మారిన బీజేపీ.. మోదీపై మల్లికార్జున్ ఖర్గే

Tourist Spots: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే న్యూస్ మీకోసం..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 03:01 PM

Advertising
Advertising