ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN, Publish Date - Mar 05 , 2024 | 11:28 AM

Andhrapradesh: నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారన్నారు.

అమరావతి, మార్చి 5: నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీకి (AP DGP) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారన్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారని.. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు తనపై పెట్టిన కేసుల విషయంలో సమాచారం ఇవ్వలేదన్నారు.

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు


ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న తనపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నానని అన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉందన్నారు. ఏ క్షణలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నట్లు తెలిపారు. వ్యక్తి గతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదని.. కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖ పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో చంద్రబాబు నాయుడు ముందుగానే లేఖ రాసి వివరాలు కోరారు. నామినేషన్ ప్రక్రియలో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి....

AP Politics: జగన్‌ను వాలంటీర్లు కూడా వ్యతిరేకిస్తున్నారా?.. నెల్లూరులో ఏం జరుగుతోంది?

YSRCP: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 04:49 PM

Advertising
Advertising