ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhuvaneswari: శ్రీరాములు కుటుంబానికి.. భువనేశ్వరి ఆర్థిక సాయం..

ABN, Publish Date - Mar 06 , 2024 | 09:08 PM

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక.. కళ్యాణదుర్గం రూరల్ మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు (65).. 11-09-2023న మృతి చెందారు.

అనంతపురం: జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక.. కళ్యాణదుర్గం రూరల్ మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు (65).. 11-09-2023న మృతి చెందారు. నిజం గెలవాలి కార్యక్రమం సందర్భంగా బుధవారం ముద్దినాయనపల్లి గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి.. శ్రీరాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీరాములు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వారికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. శ్రీరాములు కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

వన్నూరప్ప కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం గోపాలాపురం గ్రామంలో వన్నూరప్ప కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక.. వన్నూరప్ప(50).. 11-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. వన్నూరప్ప కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగా వన్నూరప్ప చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే వన్నూరప్ప కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.3లక్షలు ఆర్థికసాయం అందజేశారు.

Updated Date - Mar 06 , 2024 | 09:08 PM

Advertising
Advertising