Bonda Uma: జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. ఉత్తరకుమారుడు..
ABN, Publish Date - Feb 19 , 2024 | 03:04 PM
Andhrapradesh: రాప్తాడు సభలో కల్తీమద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం వేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 19: రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి (CM Jagan Reddy) ప్రగల్భాలు పలికి వీరంగం వేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (TDP Leader Deveni umamaheshwar rao) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబు సవాల్‌కు స్పందించే ధైర్యం జగన్ రెడ్డికి, వైసీపీనేతలకు (YCP Leaders) లేదన్నారు. జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చానంటున్న 2.50 లక్షల కోట్లు కల్తీ మద్యం ద్వారా... ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసిన సొమ్మే అని అన్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి సాధించింది ఏమిటంటే తనను.. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, ఇంకా మాట్లాడితే హత్యలు చేయించడం అంటూ మండిపడ్డారు.
జగన్ రెడ్డి సభలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతమైతే తన పార్టీ వారితో విలేకరులపై ఎందుకు దాడిచేయించారని ప్రశ్నించారు. పాదయాత్రలో, ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేవలం 15శాతమే నెరవేర్చారన్నారు. ‘‘85శాతం హామీల అమల్లో విఫలమైన జగన్ రెడ్డి’’ అని టీడీపీ వేసిన పుస్తకంపై కూడా ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. జగన్ రెడ్డి అర్జునుడు కాడని.. ఉత్తరకుమారుడు అని... ఉత్తుత్తి ప్రగల్భాలతో ప్రజల్ని మోసగించగడం తప్ప ఏమీ చేయలేరని విమర్శలు గుప్పించారు. సంబరాల రాంబాబు, కోతల రాంబాబు ఉత్తుత్తి ట్వీట్లు పెట్టడం ఆపేసి జగన్ రెడ్డిని బహిరంగ చర్చకు తీసుకురావాలని ఉచిత సలహా విసిరారు. కొడాలి నానీని మంత్రి పదవి నుంచి తప్పించిన జగన్ రెడ్డి.. ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించరా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 19 , 2024 | 03:05 PM