ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: జగన్ సిద్ధం సభలకు జనం సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ABN, Publish Date - Jan 31 , 2024 | 11:31 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కలిసేందుకు సిద్ధం పేరుతో సీఎం జగన్ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ సిద్ధం సభలకు వచ్చేందుకు జనం సిద్ధంగా లేరని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కలిసేందుకు సిద్ధం పేరుతో సీఎం జగన్ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ సిద్ధం సభలకు వచ్చేందుకు జనం సిద్ధంగా లేరని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ నాశనం చేస్తున్నాడని బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించి దొంగ ఓట్లు చేర్చుతున్నారని ఆరోపించారు. ఎన్నికల భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను సీఎం జగన్ నిర్వహించడం లేదని మండిపడ్డారు. జగన్ అవినీతి గురించి జనాలకు తెలిసిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయం అంటున్నారు.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. బావిలో కప్ప లాగా భరత్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను భరత్ విస్మరించాడని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రింగ్ రోడ్లు వేయిస్తానని భరత్ చెప్పారని.. ఏమయ్యాయని అడిగారు. ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేవని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అధికార పార్టీ నేతలపై విమర్శలు చేశారని బుచ్చయ్య చౌదరి గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి వెన్నులో వణుకు మొదలైందని విమర్శలు గుప్పించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 11:33 AM

Advertising
Advertising