AP Election 2024: ఎన్నికల సంఘానికి టీడీపీ నేత కనకమేడల లేఖ..కారణమిదే..?
ABN, Publish Date - Apr 07 , 2024 | 10:45 PM
ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Kanakamedala Ravindra Kumar) ఆదివారం నాడు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమరావతి: ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) ఆదివారం నాడు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం సీఈఓ మీనాను కోరినా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని ఎంపీ కనకమేడల లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు రూరల్‌లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలను అధికారులు అడ్డుకుని ధూషించారని కనకమేడల లేఖలో తెలిపారు.
AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్
ప్రతి రోజూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదని ఈ విషయాన్ని లేఖలోవివరించారు. డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎంపీ రవీంద్ర కుమార్ కోరారు.
YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 07 , 2024 | 11:06 PM