ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: అప్పుల్లో ముంచి వెళ్లాడు.. జగన్‌పై లావు శ్రీకృష్ణదేవరాయలు ఫైర్

ABN, Publish Date - Aug 06 , 2024 | 07:04 PM

వైసీపీ(YSRCP) పాలనలో ఏపీ అప్పులపాలైందని తెలుగుదేశం(TDP) పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు. అప్పుల భారం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ చేసిన అప్పులను పునర్‌వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు.

అమరావతి: వైసీపీ(YSRCP) పాలనలో ఏపీ అప్పులపాలైందని తెలుగుదేశం(TDP) పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు. అప్పుల భారం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ చేసిన అప్పులను పునర్‌వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై వివరాలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.

"ఏపీలో రెవెన్యూ లోటు, అప్పుల భారం అధికంగా ఉంది. ఏపీపీ పునర్మిర్మాణానికి కేంద్రం చేయూత అందించాలి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. పార్లమెంటు సభ్యులందరికి ఏపీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన శ్వేతపత్రాలు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర ఖర్చులు రూ.1.64లక్షల కోట్లు ఉండగా, రెవెన్యూ కేవలం రూ.1.45లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 19వేల కోట్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పు 2019లో రూ. 3.75 లక్షల కోట్లు ఉంటే... అది 2024కి రూ. 9.74 లక్షల కోట్లకు చేరింది. గత ఐదేళ్ళలో13.5 శాతం నుంచి 10.5 శాతానికి వృద్ధి రేటు పడిపోయింది. వ్యవసాయ రంగం 16 శాతం నుంచి 10 శాతానికి దిగజారింది. మూలధన పెట్టుబడి వ్యయం 2014 నుంచి 2019 మధ్య రూ.60 వేల కోట్లు ఉండగా, గత ఐదేళ్లలో అది రూ.24 వేల కోట్లకు పరిమితమైంది.


వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. వృద్ధి రేటు దిగజారిపోయింది. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడి అప్పుల కారణంగా... రాష్ట్ర తలసరి అప్పు రెట్టింపు అయ్యింది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ. 74 వేల నుంచి రూ. 1.44 లక్షలకు చేరింది. ద్రవ్యోల్బణం 4.5 శాతం నుంచి 6 శాతాన్ని మించి పోయింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక శాఖ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించాలి. మిగిలిన రాష్ట్రాలతో ఆర్థిక వృద్ధి సాధించేందుకు సాయపడాలి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం. దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌‌పై పన్ను విధించే విషయంలో కేంద్రం పునరాలోచించాలి. ఆరోగ్య, బీమా పాలసీలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా తీసివేయాలి. టెక్స్‌టైల్‌ రంగాన్ని ఆదుకునేందుకు పత్తి దిగుమతులపై సుంకాలు తగ్గించాలి.ఆర్థిక రంగం నుంచి గతంలో చెల్లించాల్సిన (రెట్రోస్పెక్టివ్‌) పన్నుల విధానాన్ని శాశ్వతంగా ఎత్తివేయాలి. ఇతర సభ్యులు చెబుతున్నట్లు ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఏమీ ఇవ్వడం లేదు. ఈశాన్య, తూర్పు రాష్ట్రాలకు కలిపి అమలు చేసే... పూర్వోదయ పథకానికి రూ.62 వేల కోట్లు కేటాయించారు. కోస్తా విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో నిధులు ఎక్కువగా ఆయా జిల్లాలకు కేటాయిస్తారు" అని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

For Latest News and National News click here

Updated Date - Aug 06 , 2024 | 07:04 PM

Advertising
Advertising
<