ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

minister Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌తో తగ్గిన రెవెన్యూ రాబడి

ABN, Publish Date - Dec 04 , 2024 | 06:13 AM

మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ చేయడం....

  • వెంటనే విజిలెన్స్‌ కమిషన్‌ విచారణ చేపట్టాలి

  • టీడీపీ సీనియర్‌ నేత యనమల

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ చేయడం వల్ల రాష్ట్రానికి రెవెన్యూ రాబడి తగ్గిపోతుందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆదాయం తగ్గినప్పుడు రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌ అందుకు కారణమైన స్మగ్లింగ్‌పై విచారణకు ఆదేశించవచ్చని పేర్కొన్నారు. విచారణ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఎన్నో ఏళ్ల తరబడి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ప్రభుత్వమే పేర్కొంటున్నందున వెంటనే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నారని యనమల ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Dec 04 , 2024 | 06:14 AM