ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kanakamedala Ravindra Kumar: టీడీపీ కేంద్రంలో కీలకపాత్ర పోషించడం ఖాయం

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:34 PM

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, కార్యాలయం సిబ్బంది పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించి ఇవాళ్టికి 43 ఏళ్లు అయ్యిందన్నారు.

ఢిల్లీ: టీడీపీ (TDP) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ (NTR) చిత్రపటానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar), కార్యాలయం సిబ్బంది పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించి ఇవాళ్టికి 43 ఏళ్లు అయ్యిందన్నారు. తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, నటరత్న ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు ప్రజలందరికీ కనకమేడల శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన ఆరు నెలలు తిరగకుండానే అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ సమాజమే దేవాలయమని పిలుపునిచ్చారని కనకమేడల పేర్కొన్నారు.

Cancellation of trains: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రెండు రూపాయలకు కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చిన విషయాన్ని కనకమేడల గుర్తు చేశారు. రైతులకు 50 రూపాయలకు ఎన్టీఆర్ కరెంట్ అందించారని తెలిపారు. అనేక ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవలు అందించారన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఏపీలో కొన్ని దుష్ట శక్తులతో పార్టీ బలహీన పడిందని.. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామన్నారు. టీడీపీ కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని కనకమేడల తెలిపారు.

YSRCP: వైసీపీ కోసం పనిచేయాలంటూ అధికారులపై ఒత్తిళ్లు.. రంగంలోకి విజయసాయి..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 12:35 PM

Advertising
Advertising