ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Free Sand Scheme : ఇక ఇసుక ఉచితం

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:57 AM

ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకూ ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి

  • మార్గదర్శకాల విడుదలకు సర్వం సిద్ధం.. ప్రతి ఒక్కరికీ గృహనిర్మాణాలకు ఉచితం

  • కాంట్రాక్టు నుంచి వైదొలగనున్న ప్రతిమ, జీసీకేసీ.. గనుల శాఖకు

  • రీచ్‌లు, డంప్‌లు అప్పగింత.. డిపోల్లో 44.50 లక్షల టన్నుల ఇసుక రెడీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకూ ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ మేరకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించనుంది. దాని అమలుకు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గనుల శాఖ సర్వం సిద్ధం చేసింది.

జగన్‌ సర్కారు తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ-2020 స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా నూతన ఇసుక పాలసీ-2024ను ప్రకటించనుంది. ఈ పాలసీ ఏకైక లక్ష్యం.. కులం, మతం, వర్గం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికీ గృహనిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందించడమే. ఉచితంగా అందించే క్రమంలో ప్రభుత్వం ఇకపై సీనరేజీ ఫీజులు వసూలు చేయదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016-19 వరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేసిన సంగతి తెలిసిందే.

జగన్‌ సర్కారు వచ్చాక ఉచితాన్ని తీసేసి అంగడి సరుకుగా మార్చేశారు. జగన్‌ పాలనలో రీచ్‌లతో సంబంధం లేకుండా 20 టన్నుల ఇసుక లారీ గరిష్ఠంగా 46 వేలకు అమ్మారు. ట్రాక్టర్‌ ఇసుకను 13 వేలకు అమ్మారు. పెరిగిన ధరలతో గత ఐదేళ్లూ నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లక్షల కోట్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, నిర్మాణ రంగ పురోగతిపై పడింది. ఇవేవీ పట్టించుకోని జగన్‌ తన పంథానే కొనసాగించారు. ఫలితంగా ఇసుక దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న ఆలోచనే మానుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఉచిత ఇసుక అమలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు పలు వేదికలపై హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నారు.


ఉచిత విధానం ఇలా..

ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం రెవెన్యూ కోరుకోవడం లేదు. కాబట్టి గనుల శాఖ ఎలాంటి సీనరేజీ ఫీజులు వసూలు చేయదు. ఇసుక ప్రైవేటు అమ్మకాలు ఉండవు. ఎవరైనా సరే ఇసుక డిపోకు వెళ్లి లారీ, ట్రాక్టర్‌, ఎద్దుల బండి, ఇంకా మినీ ఆటోల్లో కూడా ఇసుకను తీసుకుపోవచ్చు. అయితే ఇసుక తవ్వినందుకు, తిరిగి లారీల్లో లోడ్‌చేసి ఇసుక డిపోకు తరలించినందుకు లేబర్‌ (కార్మికుల), ట్రాన్స్‌పోర్టు (రవాణా) చార్జీలు ప్రజలు చెల్లించాలి.

అలాగే ఇసుక తీసుకెళ్లే సమయంలో సంబంధిత గ్రామ అవసరాల కోసం నిర్దేశించిన 88 రూపాయల ఫీజును, దానిపై జీఎస్టీని వినియోగదారులే భరించాలి. 2016-2019 కాలంలో ఇదే విధానం అమలయింది. రవాణా చార్జీలు ఇసుక రీచ్‌కు, డిపోకు మధ్య ఉండే దూరాన్ని బట్టి మారుతుంటాయి. ఏ జిల్లాల్లో ఎంత మేర చార్జీలు ఉంటాయన్నది కలెక్టర్లు ప్రకటించనున్నారు. ఉచితం కింద సగటున రోజుకు ఒక వినియోగదారుడికి అవసరాన్ని బట్టి 20 టన్నులే పంపిణీ చేస్తారు. అంతకుమించి ఇవ్వరు. ఇసుక డిపోకు వెళ్లేవారు ఆధార్‌ కార్డు, తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలి.

ఆన్‌లైన్‌ చెల్లింపులే

ఉచిత ఇసుక విధానంలో తవ్వకం, రవాణా, జీఎస్టీ చార్జీలను ఆన్‌లైన్‌లో వినియోగదారులు చెల్లించాలి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, గనుల శాఖ అధికారి నేతృత్వంలో ఓ జాయింట్‌ ఖాతాను ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి బ్యాంకులు ఇప్పటికే క్యూఆర్‌ కోడ్‌లు జారీ చేశాయి. ఇసుక డిపోల్లో ఈ క్యూఆర్‌ కోడ్‌లు అందుబాటులో ఉంచుతారు. వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్‌పే, భీమ్‌ పే వంటి వాటి ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ సదుపాయం లేని వారు నేరుగా డిపోలోని అధికారికి నగదు ఇస్తే దాన్ని డిజిటల్‌ పేమెంట్‌గా మార్చి చెల్లింపులు జరిగే అవకాశం కల్పించనున్నారు.


డిపోల్లో 44.50 లక్షల టన్నులు...

గనుల శాఖ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 44.50 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది. 18 జిల్లాల పరిధిలో ప్రతిమ ఇన్‌ఫ్రా, 8 జిల్లాల పరిధిలో జీసీకేసీ సంస్థలు తమ నియంత్రణలోని ఇసుక డంప్‌లను గనుల శాఖకు స్వచ్ఛందంగా అప్పగించాయి. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో బోట్‌మెన్‌ సొసైటీల పరిధిలోని ఇసుకను కూడా డిపోల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. వర్షాకాలం ముగిసేవరకు కనీసం కోటిన్నర టన్నుల ఇసుక అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతానికి 44.50 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. 15 రోజులకు కూడా సరిపోదని ఓ సీనియర్‌ అధికారి చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో సెప్టెంబరులో వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లోని రీచ్‌ల్లో మాన్యువల్‌ మైనింగ్‌ ద్వారా ఇసుకను డిపోలకు తరలించాలన ్న ప్రతిపాదనలు గనుల శాఖ పరిశీలనలో ఉన్నాయి.

ఒప్పందం నుంచి విరమణ

ఇసుక తవ్వకం, అమ్మకం కాంట్రాక్టు నుంచి ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ సంస్థలు స్వచ్ఛందంగా వైదొలగనున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. తొలుత ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరపడానికి ముందు ఒప్పందాన్నే టర్మినేట్‌ చేయాలనుకుంది. అయితే, తామే వైదొలగాలని, దీనివల్ల సుప్రీం కోర్టులో దాఖలైన అక్రమ మైనింగ్‌ కేసుల నుంచి ఉపశమనం కలగొచ్చని కంపెనీలు భావించాయి. గనుల శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి ఆ కంపెనీల ప్రతినిధులు లిఖితపూర్వకంగా తెలిపాయు. తమ నియంత్రణలో ఉన్న ఇసుక రీచ్‌లు, డంప్‌లు ఇప్పటికే గనుల శాఖకు అప్పగించాయి. దీంతో లావాదేవీలను ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాతే సెటిల్‌ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 08 , 2024 | 06:59 AM

Advertising
Advertising
<