ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : కూడబలుక్కుని కూల్చేశారు!

ABN, Publish Date - Jun 18 , 2024 | 03:59 AM

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

జగన్‌, అధికారుల నిర్వాకం

పోలవరానికి ఆయనే శాపం: చంద్రబాబు

  • నేను చేసిన పనులన్నీ కొరగాకుండా పోయాయి

  • అంతా సంక్లిష్టం చేసేశారు.. ఇది క్షమించరాని నేరం: బాబు

  • పోలవరం పూర్తికి మరో నాలుగేళ్లు!

  • డయాఫ్రం వాల్‌ కొత్తది కట్టాలి.. 990 కోట్లు ఖర్చు

  • పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అధికారుల వెల్లడి

  • పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటన

  • కీలక కట్టడాల స్థితిగతులపై ఆవేదన

  • సమీక్షలో అధికారులపై ఆగ్రహం

  • జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

  • శశిభూషణ్‌, ఈఎన్‌సీ, సీఈపై మండిపాటు

  • జగన్‌ పాలకుడు కాదు.. విధ్వంసకుడు

  • ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలో

  • కూడా అర్థం కావడం లేదు

  • జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తాం

  • ప్రజాభిప్రాయం మేరకు చర్యలు

  • మరోసారి పూర్తిస్థాయి సమీక్ష చేస్తా: సీఎం

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ప్రాజెక్టు విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ప్రజల ముందుంచి వారి అభిప్రాయం ప్రకారం ఏం చేయాలో నిర్ణయిస్తామని స్పష్టంచేశారు. సోమవారం ఆయన ప్రాజెక్టు వద్ద క్షేత్ర స్థాయిలో పర్యటించారు. నిర్మాణ పనులన్నిటి వద్దా ఆగి ఎక్కడెక్కడ ఏయే లోపాలు జరిగాయి.. గడిచిన ఐదేళ్లుగా జరిగిన నష్టం, దుర్వినియోగమైన ప్రజా ధనం తదితరాలన్నిటినీ గంటన్నరకు పైగా క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులను ఆరా తీశారు. కీలక కట్టడాలైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం.. ఎగువ , దిగువ కాఫర్‌ డ్యాంలలో సీపేజీ, గైడ్‌బండ్‌ కుంగిపోవడం.. ప్రాజెక్టు క్షేత్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు కనిపించడంతో సీఎం చలించిపోయారు. అనంతరం జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి, మాజీ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో తొలి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు (జలవనరులు), కొలుసు పార్థసారథి (గృహనిర్మాణం), కందుల లక్ష్మీదుర్గేశ్‌ (పర్యాటకం), పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఏలూరు కలెక్టర్‌ వెంకటేశ్‌ కూడా పాల్గొన్నారు. 30 నిమిషాలపాటు సాగిన సమీక్షలో పోలవరం దుస్థితిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్రం సంపూర్ణంగా సహకరించినా ప్రాజెక్టును ధ్వంసం చేశారని ఆయన అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుపై నిరంతరం సమీక్షిస్తూ.. సమస్యలను అధిగమించి ఒక కొలిక్కి తీసుకొచ్చానని.. ఇప్పుడు ప్రాజెక్టును చూస్తుంటే ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో కూడా అర్థం కావడం లేదని.. పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు.


32వ సారి ఇక్కడకు వచ్చా..: ‘పోలవరం నిర్మాణంపై 2014-19 మధ్యకాలంలో 163 సార్లు వర్చువల్‌ సమీక్షలు నిర్వహించాను. 31 సార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి.. సమీక్షించాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 32వ సారి స్వయంగా వచ్చాను. అంతా సవ్యంగా జరిగితే.. 2020 డిసెంబరు నాటికి పూర్తయ్యేది. కానీ 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. ఆయన, అధికారులందరూ కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను కూల్చేశారు. కేంద్రం ముందు రాష్ట్రం తలదించుకునేలా చేశారు. దీనికి ఏం జవాబు చెబుతాం? దీనికి కారకులెవరు.. బాధ్యత ఎవరు వహిస్తారు’ అని శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ నరసింహమూర్తిని చంద్రబాబు ఆగ్రహంతో నిలదీశారు. శశిభూషణ్‌ సమాధానం చెప్పలేదు. సీఈ మాత్రం తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. తాను హెడ్‌క్వార్టర్‌లో ఉంటానని.. నిర్మాణ బాధ్యతలన్నీ అప్పటి సీఈ చూశారని నారాయణరెడ్డి చెప్పారు. దీంతో మరింత అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఈ విధ్వంసంలో మీ బాధ్యత లేదా అని ఆయన్ను ప్రశ్నించారు. పూర్తిస్థాయి సమీక్షకు ఇప్పుడు సమయం లేదని.. త్వరలోనే మళ్లీ ప్రాజెక్టు పరిశీలనకు వచ్చి సమీక్షిస్తానని స్పష్టం చేశారు.

జగన్‌ నాయకుడు కాడు.. విధ్వంసకుడు. దురదృష్టం కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఐదేళ్లు కష్టపడి ఒక దశకు తీసుకొచ్చిన పనులన్నిటినీ నిర్వీర్యం చేశారు. గత ఐదేళ్లలో వాటిల్లిన నష్టానికి కారకులెవరు?

- చంద్రబాబు

Updated Date - Jun 18 , 2024 | 03:59 AM

Advertising
Advertising