ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IAS Offisers Issue: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో షాక్.. వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు

ABN, Publish Date - Oct 16 , 2024 | 05:26 PM

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ (తెలంగాణ), సి.హరికిరణ్‌, లోతేటి శివశంకర్‌, జి.సృజన(ఏపీ) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని..

IAS Officers

క్యాడర్‌ వివాదంలో ఏడుగురు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. తమ బదిలీలపై క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానంలో నిరాశ తప్పలేదు. ఐఏఎస్‌ అధికారులు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. వెంటనే ఏడుగురు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో హైకోర్టులోనూ వారికి ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ (తెలంగాణ), సి.హరికిరణ్‌, లోతేటి శివశంకర్‌, జి.సృజన(ఏపీ) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.


హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఐఏఎస్ అధికారుల లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాసేవ కోసమే ఐఏఎస్‌లు ఉన్నారని వ్యాఖ్యానించింది. కేంద్రం ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లాలని సూచించింది. ట్రిబ్యునల్ పిటిషన్ కొట్టివేసిందని కోర్టులకు రావడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది. మరోవైపు క్యాట్‌లో నవంబర్ నాలుగో తేదీన విచారణ ఉందన్న ఐఏఎస్ అధికారుల తరుఫు న్యాయవాది.. ఈ పదిహేను రోజుల పాటు రిలీవ్ చేయవద్దని కోరారు. అయితే స్టే ఇస్తూ పోతే ఈ వ్యవహారం ఎప్పటికీ తేలదన్న హైకోర్టు.. క్యాట్‌లోనూ సీనియర్ అధికారులు ఉంటారని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. క్యాట్ ఆదేశాలను సమర్థిస్తూ ఐఏఎస్ అధికారుల పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.


రిపోర్టు చేయాలంటూ..

ఐఎఎస్ అధికారులు వెంటనే డీవోపీటీ కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని హైకోర్టు సూచించింది. బాధ్యతాయుతమైన అధికారులుగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని అభిప్రాయపడింది. మరోవైపు డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 16 అంటే ఇవాళ సాయంత్రంలోగా వారంతా వారి సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. క్యాట్ సైతం ఇవే ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.

ముందుగా క్యాట్‌లో..

ఏపీ విభజన సందర్భంగా జరిగిన క్యాడర్‌ కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న ఏడుగురు ఐఏఎస్‌ అధికారులు తమ రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేయడంతో.. అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోవాలని ఐఏఎస్ అధికారులకు క్యాట్‌ స్పష్టం చేసింది. ఐఏఎస్‌ అధికారులు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ఈ నెల 16న ఎక్కడి అధికారులు అక్కడికి వెళ్లిపోవాలంటూ డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి క్యాట్‌ నిరాకరించింది. ఈ ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు ఏపీకి.. ఏపీలో పనిచేస్తున్న వారు తెలంగాణకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. తాము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే ఉంటామని.. డీవోపీటీ ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేయాలని పేర్కొంటూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు హైదరాబాద్‌ క్యాట్‌లో పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారుల తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించని క్యాట్ తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 16 , 2024 | 05:26 PM