ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Big Breaking: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. జులై 8వ తేదీ నుంచే ఉచితంగా..

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:36 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Free Sand Scheme

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని(Free Sand Scheme) ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించనున్నారు.

Also Read: జగన్‌ కేసులపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు


రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఐదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని అమలు కూడా చేసింది. అయితే, 2019లో జగన్ సర్కార్ వచ్చిన తరువాత.. ఈ ఉచిత ఇసుక విధానానికి స్వస్తి పలికారు. దీంతో పేదలు తీవ్రంగా నష్టపోయారు. గృహనిర్మాణ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలోనే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు.. ప్రభుత్వం పూనుకుంది. ఉచిత ఇసుక పంపిణీకి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది.. పేదలకు ఎలాంటి మేలు జరిగింది.. 2019-24(మే) వరకు ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది.. ఎవరు లబ్ధిపొందారు.. ప్రభుత్వానికి జరిగిన నష్టం.. పేదలు, గృహ నిర్మాణరంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేయాలని ఆదేశించారు.

Also Read: తుది దశకు చేరిన పీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం


అలాగే, ప్రస్తుతం ఇసుక రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు నివేదించారు. ఉచిత ఇసుక విధానంతోపాటు, గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర అంశాలపైనా గనుల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. ఇకపై ఆఫ్‌లైన్‌ ఇసుక అమ్మకాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుకతోపాటు ఇతర అమ్మకాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే విధానం తీసుకురావాలని తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 03:36 PM

Advertising
Advertising