TDP-Janasena: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టిన టపాసుల రగడ
ABN, Publish Date - Mar 15 , 2024 | 12:31 PM
Andhrapradesh: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ మధ్య టపాసుల రగడ చిచ్చుపెట్టింది. శ్రీకాళహస్తికి బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో నిన్న (గురువారం) రాత్రి శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ నగరం వినుత ఇంటిముందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చారు. అయితే రెచ్చగొట్టేలా వ్యవహరించిన టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి, మార్చి 15: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ (Janasena - TDP) మధ్య టపాసుల రగడ చిచ్చుపెట్టింది. శ్రీకాళహస్తికి బొజ్జల సుధీర్ రెడ్డికి (Bojjala SudhirReddy) టికెట్ ఖరారు చేయడంతో నిన్న (గురువారం) రాత్రి శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ నగరం వినుత ఇంటి ముందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చారు. అయితే రెచ్చగొట్టేలా వ్యవహరించిన టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా పరస్పరం సహకరించుకోవాలని ఇరు పార్టీ నేతలు భావించనట్లు తెలుస్తోంది. అయితే టికెట్ ఖరారు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఈ సంఘటనపై బాధ్యులపై చర్యలు గానీ, జనసేన నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేయని పరిస్థితి. దీంతో సుధీర్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉదయం నుంచి జనసేన అభ్యర్థికే శ్రీకాళహస్తి టిక్కెట్టు కేటాయించాలని జనసేన నాయకులు నిరసనకు పూనుకున్నారు. మరి టీడీపీ, జనసేన శ్రేణుల వ్యహారంపై రెండు పార్టీ అధిష్టాన పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 15 , 2024 | 12:33 PM