Trains: హైదరాబాదు నుంచి శబరిమలైకి రేణిగుంట మీదుగా 18 ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Nov 28 , 2024 | 12:17 PM
హైదరాబాదు, కాచిగూడ(Hyderabad, Kacheguda) నుంచి కొట్టాయం వరకు డిసెంబరు 3 నుంచి రేణిగుంట మీదుగా 18 ప్రత్యేక రైళ్ళు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్(South Central Railway CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి: హైదరాబాదు, కాచిగూడ(Hyderabad, Kacheguda) నుంచి కొట్టాయం వరకు డిసెంబరు 3 నుంచి రేణిగుంట మీదుగా 18 ప్రత్యేక రైళ్ళు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్(South Central Railway CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులో ఈ ప్రత్యేక రైళ్ళు(07135) డిసెంబరు3, నుంచి 10,17, 24, 31తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి బేగంపేట, వికారాబాదు, తాండూరు, రాయచూర్, గుంతకల్లు, రాజంపేట, రేణిగుంట,కాట్పాడి, కోయంబత్తూరు, పాల్‌కాడ్, ఎర్నాకులంటౌన్ మీదుగా మరుసటి రోజు 4.10 గంటలకు కొట్టాయానికి చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్ళు (07136) డిసెంబరు 4 నుంచి (ప్రతి గురువారం) 11, 18, 25, జనవరి ఒకటవ తేదీల్లో రాత్రి 11.45 గంటలకు కొట్టాయంలో బయలు దేరి వచ్చిన మార్గంలోనే మరుసటి రోజు హైదరాబాదుకు చేరుకుంటాయి.
ఈ వార్తను కూడా చదవండి: Dy CM: రాష్ట్రంలో అలజడులకు కుట్ర పన్నుతున్నారు..
- కాచిగూడలో ఈ ప్రత్యేక రైళ్ళు(07133) వచ్చేనెల 5, 12, 19, 26 తేదీల్లో( ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, రాజంపేట, రేణిగుంట,కాట్పాడి, అలువ, ఎర్నాకులంటౌన్ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 6.50గంటలకు కొట్టాయానికి చేరుకుంటాయి. కొట్టాయంలో ఈ ప్రత్యేక రైలు(07134) డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటాయి.
పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు
తిరుపతి: తిరుపతి నుంచి అకోల, పూర్ణా, సికింద్రాబాదు(Secunderabad) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను డిసెంబరు 6 నుంచి 30వ తేదీవరకు రాకపోకలు సాగిస్తాయని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
- తిరుపతి-అకోల మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం తిరుపతిలో.. ప్రతి ఆదివారం అకోలలో బయలుదేరుతుంది.
- పూర్ణా- తిరుపతి మధ్య నడిచేరైలు పూర్ణాలో ప్రతి సోమవారం బయలు దేరుతుంది. ఇదే రైలు తిరుపతిలో ఈ రైలు ప్రతి మంగళవారం బయలుదేరుతుంది.
- తిరుపతి-సికింద్రాబాదు మధ్య నడిచే రైలు, తిరుపతిలో ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. ఇదే రైలు సికింద్రాబాదులో ప్రతి సోమవారం బయలుదేరుతుంది.
కదిరిదేవరపల్లి- గుంతకల్ మధ్య ప్యాసింజరు రద్దు
తిరుపతి- కదిరిదేవరపల్లి మధ్య రోజువారీగా రాకపోకలు సాగిస్తున్న ప్యాసింజరు రైలు డిసెంబరు ఒకటి నుంచి 31వ తేదివరకు కదిరిదేవరపల్లి-గుంటకల్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు సీపీఆర్‌వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2024 | 12:17 PM