ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP, TG CM's Meeting: ఇద్దరు సీఎంల మీటింగ్.. రెండు కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రులు..!

ABN, Publish Date - Jul 06 , 2024 | 09:47 PM

విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణ కోసం కమిటీలు వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.

AP, TG Ministers

విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణ కోసం కమిటీలు వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను భేటీలో పాల్గొన్న ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు వెల్లడించారు. తొలుత భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలనుకునే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలకు మొదటి సమావేశంలోనే పరిష్కారాలు దొరుకుతాయని అనుకోలేదన్నారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ముఖ్యమంత్రుల భేటీలో రెండు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు సీఎంలు చర్చించుకున్న తర్వాత సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో ట్రీమెన్ కమిటీని వేయాలని నిర్ణయించామన్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురు చొప్పున కమిటీలో ఉంటారన్నారు. ఈ కమిటీ సమావేశమై రెండు వారాల్లో సమస్యలకు పరిష్కారమార్గాలు కనుగొనాలని నిర్ణయించామన్నారు. అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రుల స్థాయిలో కమిటీ వేసి పరిష్కారమార్గాలు కనుగొనాలన్నారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం దొరకకపోతే సీఎంల స్థాయిలో సమావేశం ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు భట్టివిక్రమార్క తెలిపారు.

Chandrababu- Revanth Meeting : సీఎం హోదాలో తొలిసారి కలిసిన ఇద్దరు నేతలు..!


డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం..

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, తెలుగు రాష్ట్రాల మధ్య డ్రగ్స్ రవాణాను నియంత్రించేందుకు సమన్వయంతో పనిచేసేందుకు ఓ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించామని భట్టివిక్రమార్క తెలిపారు. సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకుపోతున్న ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. అడిషనల్ డీజీ స్థాయిలో ఇద్దరు అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటుచేస్తామన్నారు.

CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..


తెలుగుజాతి హర్షించే రోజు..

ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం జరిగిన రోజు తెలుగుజాతి హర్షించే మంచిరోజని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు పనిచేస్తున్నారన్నారు.విభజనచట్టంలో అంశాలపై చర్చించేందుకు సమావేశమవుదామని నిరంతరం ఏపీ అభివృద్ధి కాంక్షిస్తూ.. అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారని.. తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. విభజన సమస్యలపై చర్చించామని.. అందరి సలహాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు.


CMs Meet: 5 గ్రామాలను కోరిన సీఎం రేవంత్

మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More AP, Telangana News and Latest Telugu News

Updated Date - Jul 06 , 2024 | 10:18 PM

Advertising
Advertising
<