ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: లేపాక్షి కాలనీలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం.. వేసిన రోడ్డును తవ్వించేశాడు

ABN, Publish Date - Jan 29 , 2024 | 10:27 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ సీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధి చేస్తే తామే చేయాలని, ఇతరులు చేయొద్దని అంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత వేసిన సీసీ రోడ్డును తీసి వేయించాడు.

శ్రీ సత్యసాయి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ సీపీ నేతల (YSRCP) ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధి చేస్తే తామే చేయాలని, ఇతరులు చేయొద్దని తెగేసి చెబుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత (YCP Leader) వేసిన రోడ్డును తీసి వేయించాడు. బిల్లు మీరే తీసుకోవాలని ఆ కాంట్రాక్టర్ చెప్పినా వినిపించుకోలేదు.

హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో గల ఎస్సీ కాలనీలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ నిధులతో ఆ నిర్మాణం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణ పనులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో పూర్తయ్యింది. ఈ విషయం తెలిసిన వైసీపీ నేత తిప్పన్న ఊగిపోయాడు. సీసీ రోడ్డు నిర్మాణం జరిగే చోటకు వచ్చాడు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్‌ను బెదిరించాడు. ‘ఇక్కడ రోడ్డు వేస్తే మేమే వేయాలి. మాకు తెలియకుండా సీసీ రోడ్డు వేస్తారా. వెంటనే ఆ రోడ్డును ధ్వంసం చేయండి. లేదంటే అట్రాసిటీ కేసు పెడతా అని’ కాంట్రాక్టర్‌ను భయభ్రాంతులకు గురిచేశాడు.

వైసీపీ నేత తిప్పన బెదిరించడంతో కాంట్రాక్టర్ హడాలిపోయాడు. వేసిన రోడ్డు అలానే ఉండనీయాలని వేడుకున్నాడు. కావాలంటే వచ్చిన బిల్లు మీరే తీసుకోవాలని కోరాడు. అయినప్పటికీ తిప్పన్న కఠిన మనస్సు కరగలేదు. రోడ్డు పూర్తయిన తవ్వడం ఖాయం అని తిప్పన్న బెదిరించాడు. చేసేదేమీ లేక ఆ కాంట్రాక్టర్ వేసిన రోడ్డును జేసీబీతో ధ్వంసం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలకు ఇది ప్రత్యక్ష ఉదహరణగా నిలిచింది. రూ.లక్షలు ఖర్చు చేసి వేసిన రోడ్డును తవ్వించే శాడిస్ట్ నేతలు ఉన్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 10:27 AM

Advertising
Advertising