ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

ABN, Publish Date - Dec 04 , 2024 | 05:11 AM

కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.

  • నాడు తండ్రి ఎర్రన్నాయుడికీ దక్కిన గౌరవం

న్యూఢిల్లీ, శ్రీకాకుళం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు. పార్లమెంటులోని ఉభయసభల్లో ముందు వరుసలో కేంద్ర కేబినెట్‌లోని ముఖ్యమైన శాఖల మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు అసీనులవుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామ్యపక్షం అయినందువల్ల రామ్మోహన్‌నాయుడికి ఈ ప్రాధాన్యం ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక భాగస్వామ్యపక్షం అయినందువల్ల రామ్మోహన్‌నాయుడి తండ్రి ఎర్రన్నాయుడికి కూడా ముందు వరుసలో సీటు కేటాయించిన విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్‌లో ముఖ్యమైన శాఖల మంత్రులకు మాత్రమే దక్కే ఈ ఘనత దక్కడంపట్ల రామ్మోహన్‌ నాయుడు స్పందిస్తూ ‘తెలుగు వారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవం’గా అభివర్ణించారు.

Updated Date - Dec 04 , 2024 | 05:11 AM