Vangalapudi Anitha : బాలిక హత్య కేసులో నిందితుడ్ని వదలం
ABN, Publish Date - Jul 08 , 2024 | 04:19 AM
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
గాలింపునకు ప్రత్యేక బృందాలు
మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటాం: హోం మంత్రి
అనకాపల్లి టౌన్, జూలై 7: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. అనకాపల్లిలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో నిందితుడు బాలికను ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులు జైలుకు పంపారని.. ఇటీవల బెయిల్‌పై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారని వెల్లడించారు. హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. చీరాలలో సంఘటన జరిగిన 36 గంటల్లో నిందితులను పట్టుకుని, కోర్టుకు తరలించామన్నారు. గంజాయి మత్తులోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.
Updated Date - Jul 08 , 2024 | 04:30 AM