ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vasantha Krishna Prasad: పేదల పక్షపాతి ఎన్టీఆర్

ABN, Publish Date - Mar 29 , 2024 | 01:00 PM

ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ (TDP) అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad) పాల్గొన్నారు. ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు వసంత పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలుగుజాతి ఔన్నత్యం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు.

Cancellation of trains: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని వసంత కృష్ణ ప్రసాద్ కొనియాడారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పునాదులు వేసిన ఘనత అన్న ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం, పేదలకు పక్కా గృహాలు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల పక్షపాతిగా ఎన్టీఆర్‌ను కొనియాడారు. మైలవరం నియోజవర్గ ప్రజల అండదండలతో 2019లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టానన్నారు. తాను అదే స్ఫూర్తితో మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం 2024లో తిరిగి పోటీ చేస్తున్నానని, తనని గెలిపించాలని వసంత విజ్ఞప్తి చేశారు.

YSRCP: వైసీపీ కోసం పనిచేయాలంటూ అధికారులపై ఒత్తిళ్లు.. రంగంలోకి విజయసాయి..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 01:00 PM

Advertising
Advertising