ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న సీఎం జగన్: వసంత కృష్ణ ప్రసాద్

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:39 PM

వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడేసుకుంటున్నారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. బుధవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండల పరిధిలోని ముచ్చనపల్లి, కుదప గ్రామాల్లో టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా - రెడ్డిగూడెం: వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడేసుకుంటున్నారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. బుధవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండల పరిధిలోని ముచ్చనపల్లి, కుదప గ్రామాల్లో టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కమిషన్లు తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో ప్రభుత్వం ఖాజానాలో సొమ్ము లేదని.. అందుకే వృద్ధులకు పింఛన్ సొమ్ము సకాలంలో అందలేదని మండిపడ్డారు.

AP Elections: జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం.. పెన్షన్ల పేరిట నీచ రాజ‌కీయం..

వృద్ధులను ఎండలో తిప్పుతూ జగన్ పైశాచికానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. పింఛన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై దుష్ప్రచారం తగదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం తగదని ఎన్నికల కమిషన్ ఎప్పుడో ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం కాలపరిమితి ముగిసిపోతూ ఉండటంతో కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి కమీషన్లు తీసుకుని బిల్లులు క్లియర్ చేయటంతో నేడు పింఛన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 10:46 PM

Advertising
Advertising