ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మ

ABN, Publish Date - Jul 08 , 2024 | 06:07 AM

పట్టిసీమ నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ కృష్ణమ్మ ఒడికి చేరింది. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద పవిత్ర సంగమంలో ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో కలిసింది.

  • ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో కలిసిన గోదావరి నీరు

  • నేడు పవిత్ర సంగమం వద్ద మంత్రి నిమ్మల పూజలు

  • కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మ!

  • ఫెర్రీ వద్ద కృష్ణానదిలో కలిసిన గోదావరి నీరు

  • నేడు పవిత్ర సంగమం వద్ద మంత్రి నిమ్మల పూజలు

విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ కృష్ణమ్మ ఒడికి చేరింది. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద పవిత్ర సంగమంలో ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో కలిసింది. పట్టిసీమ నుంచి ప్రస్తుతం 6018 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అందులో నుంచి వెలగలేరు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరింది.

పట్టిసీమ వద్ద ఈనెల మూడో తేదీన పంపులను ఆన్‌ చేశారు. తొలుత 21 పంపులను ఆన్‌ చేసిన అధికారులు తర్వాత వాటిని 17కు తగ్గించారు. సరిగ్గా ఐదు రోజులకు గోదావరి నీరు కృష్ణమ్మను తాకింది. పట్టిసీమ నుంచి నీరు రావడంతో ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్న సంగమ ప్రాంతం ఎరుపెక్కుతోంది. గోదావరి నీళ్లు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సోమవారం పూజలు నిర్వహిస్తారు.

Updated Date - Jul 08 , 2024 | 06:09 AM

Advertising
Advertising
<