ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: విజయవాడ పశ్చిమలో బీజేపీ గేమ్ ప్లాన్.. షాక్‌లో వైసీపీ..

ABN, Publish Date - Apr 12 , 2024 | 02:16 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. జనసేన(Janasena)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో కూటమికి నష్టం జరుగుతుందని అంతా అంచనా వేశారు. కాని వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేలా బీజేపీ మరో ప్లాన్ వేసింది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. జనసేన(Janasena)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో కూటమికి నష్టం జరుగుతుందని అంతా అంచనా వేశారు. కాని వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేలా బీజేపీ మరో ప్లాన్ వేసింది. దీంతో వైసీపీ నేతలకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందనే చర్చ జరుగుతోంది. పోతిన మహేష్ జనసేన నుంచి విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించారు. పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జనసేనకు రాజీనామా చేశారు. పోతిన మహేష్‌ను చేర్చుకోవడం ద్వారా తమకు లాభం చేకూరుతుందని, ఆ సామాజిక వర్గం ఓట్లు విజయవాడ పశ్చిమలో అధికంగా ఉండటంతో ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని వైసీపీ ప్లాన్ వేసింది.

Nara Bhuvaneshwari: సంక్షేమం పేరిట దోచేశాడు


వైసీపీ ప్లాన్‌కు ధీటుగా..

గత 9ఏళ్లుగా పోతిన మహేష్ తన అనుచరులను తయారుచేసుకున్నారు కాని.. పార్టీ క్యాడర్‌ను తయారు చేయలేదు. అలాగే అనుచరులను తప్పితే జనసైనికులను పెద్దగా పట్టించుకునేవారు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా మహేష్‌ను జనసేనకు దూరం చేస్తే.. బీజేపీ అభ్యర్థి గెలుపునకు బ్రేకులు వేయవచ్చనే ఆలోచనతో పోతినను పార్టీలో చేర్చుకుంది. అయితే వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహ్యాంగా బీజేపీ నగరాలు సామాజికి వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు పైలా సోమినాయుడుని పార్టీలో చేర్చుకుంది. కొంతకాలంగా వైసీపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న పైలా సోమినాయుడు ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆయనకు నగరాల సామాజిక వర్గంలో గట్టి పట్టుఉండటంతో పాటు.. ప్రజలతో పరిచయాలున్న వ్యక్తి. ఆ నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేయగల సామర్థ్యం సోమినాయుడుకు ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్‌గా పనిచేశారు.


ఎవరితో ఎవరికి లాభం..

పోతిన మహేష్‌తో పోల్చుకుంటే సోమినాయుడు ప్రభావం నియోజకవర్గంలో ఎక్కువుగా ఉంటుంది. సోమినాయుడు బీజేపీలో చేరడంతో విజయవాడ పశ్చిమలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పోతినను చేర్చుకోవడం ద్వారా బీజేపీని అడ్డుకోవచ్చనే ప్లాన్ బెడిసికొట్టినట్లైందని, సోమినాయుడు చేరికతో తమకే నష్టమనే చర్చ వైసీపీలో సాగుతోంది. మరోవైపు నియోజకవర్గంలోని మైనార్టీ నేతలు సైతం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీకి షాక్ తగిలినట్లైందనే చర్చ లేకపోలేదు. పోతిన రాకతో వైసీపీకి ఎలాంటి లాభం ఉంటుందో తెలియనప్పటికీ.. సోమినాయుడు వెళ్లిపోవడం నియోజకవర్గంలో పార్టీకి నష్టమనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఎవరి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది జూన్4 ఫలితాల తర్వాత తెలియనుంది.


YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 02:16 PM

Advertising
Advertising