ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special Mobile Court : విజయ్‌పాల్‌ కస్టడీపై రేపు నిర్ణయం

ABN, Publish Date - Dec 10 , 2024 | 04:20 AM

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్‌ ఎస్పీ విజయ్‌పాల్‌ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనుంది.

  • రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అరెస్టు

  • కోర్టులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు

గుంటూరు(లీగల్‌), డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్‌ ఎస్పీ విజయ్‌పాల్‌ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనుంది. సోమవారం గుంటూరులోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ఇన్‌చార్జి, ఎక్సైజ్‌ కోర్టు మేజిరేస్టట్‌ జి.స్పందన వద్ద ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిశాయి. తీర్పును మేజిరేస్టట్‌ బుధవారానికి వాయిదా వేశారు. విజయ్‌పాల్‌ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో స్పెషల్‌ పీపీగా నియమితులైన ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వి.రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అప్పట్లో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు అప్పటి ముఖ్యమంత్రిని విమర్శించారని తద్వారా రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ దర్యాప్తు పేరుతో 2021 మే 14న 25 నుంచి 30 మంది కాన్వాయ్‌గా వెళ్లి హైదరాబాద్‌లోని రఘురామ ఇంట్లోకి అక్రమంగా చొరబడి అదుపులోకి తీసుకున్నారని, గుంటూరు సీఐడీ కార్యాలయంలోని ఒక రూంలో ఇంటరాగేషన్‌ పేరుతో ఉంచారని తెలిపారు. ఆ రూము వద్ద ఉన్న కొందరు పోలీసులను దర్యాప్తు అధికారి విజయ్‌పాల్‌ దూరంగా పంపించి వేశారని, ఆ తర్వాత 15 నిమిషాలకే బాధతో రఘురామకృష్ణరాజు పెడుతున్న కేకలను ఆ పోలీసులు విన్నారని చెప్పారు. రూములోకి వెళ్లేటప్పుడు తనంతతానుగా నడిచి వెళ్లిన రఘురామకృష్ణరాజును ఇంటరాగేషన్‌తో ఒక గంటలోనే నడవలేని స్థితికి తెచ్చారని, కోర్టులో హాజరు పరిచేందుకు ఇద్దరు వ్యక్తులు మోసుకురావాల్సి వచ్చిందని వివరించారు.దర్యాప్తు సమయంలో విజయ్‌పాల్‌ పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని, దర్యాప్తు అధికారి ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలూ చెప్పలేదని వివరించారు.


ఈ కేసులో జరిగిన కుట్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, నేరంలో ఎవరెవరు పాల్గొన్నారో తేల్చాల్సి ఉందని, రఘురామకృష్ణరాజును కాళ్లపై బెల్టులతో కొడుతూ, వీడియో తీసి పంపించారని, ఆ వీడియో ఎవరికి పంపారో తేలాల్సి ఉందని చెప్పారు. విజయ్‌పాల్‌ తరఫున న్యాయవాది మన్మథరావు వాదనలు వినిపిస్తూ 2021 మే 14న ఘటన జరిగితే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయకుండా మూడేళ్లు ఎందుకు సమయం తీసుకున్నారో చెప్పాల్సి ఉందన్నారు. అరెస్టుకు ముందు నోటీసు అందుకున్న ప్రతిసారీ విజయ్‌పాల్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారని తెలిపారు. పోలీసు కస్టడీకి తీసుకొని వేధించటానికే ఈ పిటిషన్‌ వేశారని, కనుక పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. దీనిపై స్పెషల్‌ పీపీ రాజేంద్రప్రసాద్‌ స్పందిస్తూ ఏ కేసులో ఎవరు దర్యాప్తు చేయాలనేది ప్రభుత్వ ఇష్టమని, దానిని నిందితులు ప్రశ్నించజాలరని పేర్కొన్నారు. ఇది హత్యాయత్నం కేసు కనుక, జీవిత ఖైదు పడే అవకాశం ఉందని, కనుక దీనికి ఇన్ని రోజుల్లోపు ఫిర్యాదు ఇవ్వాలనే కాలపరిమితి వర్తించదని తెలిపారు. రఘురామకృష్ణరాజును రాష్ట్రంలోకి వేస్త చంపేందుకు కుట్ర పన్నారని, ఆయనను రాష్ట్రంలోకి రానివ్వకుండా గత పాలకులు అడ్డుకున్నారని, దానివల్లే ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.

Updated Date - Dec 10 , 2024 | 04:21 AM