Andhra Pradesh 2024: నోరు అదుపులో పెట్టుకోండి.. నేనేంటో చూపిస్తా కొడకల్లారా..
ABN, Publish Date - Mar 31 , 2024 | 04:52 PM
అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజకీయాలు హాట్ గా మారాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కొన్ని కొన్ని సార్లు వారు చేస్తున్న కామెంట్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజకీయాలు హాట్ గా మారాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కొన్ని కొన్ని సార్లు వారు చేస్తున్న కామెంట్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రెచ్చిపోయి మరీ బూతులు మాట్లాడుతున్నారు. తాజాగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీ.వీ.ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావులపై అసభ్య దూషణలు చేశారు. మీడియా సమావేశం అని మర్చిపోయి పచ్చి బూతులు తిట్టారు. టీడీపీ వాళ్లు నోరు అదుపులో పెట్టు కోవాలని వార్నింగ్ ఇచ్చారు. నేనేంటో చూపిస్తా కొడకల్లారా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే పచ్చి బూతులతో తోటి వైసీపీ నేతలే కంగుతినడం గమనార్హం.
Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
కాగా.. గతంలో వినుకొండలో టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. తాడేపల్లి ఆదేశాలతోనే వినుకొండలో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని జీవీ ఆంజనేయులు అన్నారు. పల్నాడులో యవగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే కుట్ర చేశారన్నారు. పోలీసులే కర్రలు ఇచ్చి దాడులకు సహకరించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అప్పటినుంచి రాచుకుంటున్న నిప్పు రోజు రోజుకు తీవ్రంగా మారి అడ్డూ అదుపూ లేకుండా దూషణలు చేసుకునే స్థాయికి చేరింది.
Congress: రైతులను కాదు.. తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శించండి.. కాంగ్రెస్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 31 , 2024 | 04:53 PM