Bandaru Lakshman: సీఎం జగన్ బీసీలను బానిసలాగా మార్చేశారు
ABN, Publish Date - Jan 07 , 2024 | 08:59 PM
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు బండారు లక్ష్మణ్ ( Bandaru Lakshman ) అన్నారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో బీజేపీ బీసీ సామజిక చైతన్య సభ నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎంలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బండారు లక్ష్మణ్ మండిపడ్డారు.
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు బండారు లక్ష్మణ్ ( Bandaru Lakshman ) అన్నారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో బీజేపీ బీసీ సామజిక చైతన్య సభ నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎంలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీ రామారావు, బీసీలకు తీసుకువచ్చిన 34% రిజర్వేషన్ ఇరవై శాతానికి కుదించారని చెప్పారు. సీఎం జగన్ బీసీలను బానిసలగా మార్చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుతోనే ఆ పార్టీలకు బుధ్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉచితాలను బీసీలు స్వాగతించడం లేదన్నారు. బీసీల వాటా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలను నోరు లేని జీవులుగా మార్చేశారని చెప్పారు. 50% ఓట్లను బీసీలు రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి బీసీలకు ఎంపీసీలకి తేడా తెలియదన్నారు. కాంగ్రెస్ బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ ఎజెండానే రాజకీయ ఎజెండాగా మారాలని బండారు లక్ష్మణ్ పేర్కొన్నారు.
Updated Date - Jan 08 , 2024 | 12:05 AM