Ganta: ఐదేళ్లు స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారు.. వైసీపీకి సూటి ప్రశ్న
ABN, Publish Date - Sep 17 , 2024 | 10:18 AM
Andhrapradesh: వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: ‘‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం, మా నినాదం’’ అని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Bhimili MLA Ganta Srinivas Rao) స్పష్టం చేశారు. మంగళవారం నాడు ప్రధాని మోదీ (PM Modi) జన్మదినం పురస్కరించుకుని సాగర్ నగర్ బీచ్‌లో స్వచ్చ శుభ్రతను ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ నా రాజీనామాపై మీవి చవకబారు విమర్శలు’’ అంటూ వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ (Steel Plant) కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
KTR: ‘చిట్టినాయుడు సుభాషితాలు’.. రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాశారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు. ‘‘స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశాను. మీరు ఏం చేసారో చెప్పాలి... రాజీనామాల వల్ల ఉపయోగం లేదంటే అది మీ అవివేకం. స్టీల్ ప్లాంట్ కోసం 75 మంది రాజీనామాలు చేస్తే అది మనకి వచ్చింది. రాజీనామాలు చేస్తే ప్రభుత్వాలు కదలి వస్తాయి. రాజీనామాల వల్ల ఉపయోగం లేకపోతే జగన్ ఎందుకు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని చెప్పారు. రాజీనామాల గురించి మాట్లాడే వారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి’’ అంటూ హితవుపలికారు.
కోర్టుకు వెళ్లింది అందుకే...
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఆగినా, ప్రైవేటీకరణ జరగబోదని స్టీల్ మంత్రి కుమారస్వామి విశాఖలో ప్రకటించినా అది టీడీపీ వల్లే సాధ్యపడిందన్నారు. స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదని.. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, గుండె చప్పుడని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యేగా తాను చేసిన రాజీనామాపై మూడు సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎటూ తేల్చకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఆమోదించి వైసీపీ రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకు ఉండే ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాజీనామా విషయమై కోర్టుకు వెళ్లానే తప్ప, కేవలం రెండు నెలల గడువున్న పదవి కోసం కాదని తేల్చిచెప్పారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ఇప్పుడు వచ్చిన 11 స్థానాల్లో ఒకట్లు పోయి వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా మాత్రమే మిగులుతుంది అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు.
Ganesh Laddu Record: రికార్డులన్నీ బ్రేక్.. సంచలన ధర పలికిన గణేశుడి లడ్డూ
విశాఖను నెంబర్‌లో ఉంచుతాం...
‘‘స్వఛ్ఛత శుభ్రత జీవితంలో ఓ భాగం కావాలి. ఒక్కరోజు చేసి వదిలేసే కార్యక్రమం కాదు. ప్రధాని మోదీ పిలుపుతో దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ స్వచ్చతలో నాలుగో ర్యాంకులో ఉంది. దాన్ని నెంబర్ వన్ తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాం. విజయవాడ వరదల్లో 200 మంది జీవీఎంసీ ఉద్యోగులు సేవలు అందించారు. వారికి సన్మానం చేసి సత్కరించాం’’ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: కూల్.. కూల్.. చల్లబడిన నగరం
YS Jagan: పదైదు వేల గతం.. మరిచావా జగన్?
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 17 , 2024 | 01:15 PM