Bhupathi Raju: కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేలడం లేదు..
ABN, Publish Date - Jul 15 , 2024 | 06:00 PM
జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. వైసీపీ హయాంలో భారీగా కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
విశాఖ: జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. వైసీపీ హయాంలో కేంద్రం భారీగా ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
భూపతిరాజు మాట్లాడుతూ.. "కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయకపోగా, అసలు ఏ ఖాతాలోకి మళ్లించారో కూడా కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు. ఆ వివరాలు అందిస్తే గాని మళ్లీ నిధులు విడుదల చెయ్యలేని స్థితిని వైసీపీ తెచ్చింది. అందుకే కొత్తగా నిధులు ఇచ్చేందుకు ఇబ్బందులు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమ పాత్ర కచ్చితంగా ఉంటుందని సీఎం చంద్రబాబుకి ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ మేరకు రాజధాని అమరావతి అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించా. ఇకపై తరచూ విశాఖ వస్తూ ఉంటా. స్థానిక సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తా" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Home Minister Anitha: ఆ కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం..
Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా
Updated Date - Jul 15 , 2024 | 06:03 PM