ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vishnukumar Raju: స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవకూడదనేది అందరి భావన

ABN, Publish Date - Jul 11 , 2024 | 11:07 AM

Andhrapradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదనే భావన అందరికీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసేందుకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్‌కు ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...

BJP MLA Vishnukumar Raju

అమరావతి, జూలై 11: విశాఖ స్టీల్ ప్లాంట్ (visakha Steel Plant) ప్రైవేటైజేషన్ అవ్వకూడదనే భావన అందరికీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (BJP MLA Vishnukumar Raju) అన్నారు. గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసేందుకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్‌కు ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలకు భద్రత కల్పించి ఎంతోమంది ప్రాణత్యోగాలు చేసి స్టీల్ ప్లాంట్‌ను తీసుకొచ్చారని గుర్తుచేశారు.

Bandi Sanjay: ఐదేళ్లుగా వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన


విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ (BJP) తరఫున ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అవ్వకుండా మంచి భవిష్యత్తు స్టీల్ ప్లాంట్‌కి ఉండేటట్టు చూడవలసిందిగా తాము కూడా కోరామని తెలిపారు. ఎలక్షన్ ముందు కూడా కోరడం జరిగిందన్నారు. ఎలక్షన్ తర్వాత బీజేపీ పార్లమెంట్ సభ్యులు... కేంద్ర అధిష్టానానికి చెప్పామన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, కేంద్రమంత్రి కుమారస్వామి ప్లాంట్ విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్‌‌కు అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను సేల్‌లో టేక్ ఓవర్ చేయడమా అని ప్రశ్నించారు. ‘‘ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే.. మన భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరి అభిప్రాయం’’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP News: అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 11:11 AM

Advertising
Advertising
<