CM Ramesh: ఆర్థిక ఉగ్రవాది జగన్.. సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Jul 25 , 2024 | 10:25 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. సొంతబాబాయిని జగన్ చంపారని ఆరోపించారు.
ఢిల్లీ: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. సొంతబాబాయిని జగన్ చంపారని ఆరోపించారు. ఐదేళ్లు ఏపీలో అరాచక పాలన చేసి ఢిల్లీకి వచ్చి ఇప్పుడు జగన్ ధర్నా చేశారని మండిపడ్డారు.
గురువారం లోక్‌సభ సమావేశాల అనంతరం మీడియాతో సీఎం రమేష్ మాట్లాడుతూ... జగన్ అరాచకాలకు సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి అధికారులపై సీబీఐ, ఈడీ, విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినీతి సంపాదనంతా తిరిగి తెచ్చి ఏపీ అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. మోదీ, చంద్రబాబులకు పేరు వస్తుందనే అమరావతిని జగన్ సర్వనాశనం చేశారని సీఎం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాగా.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ బుధవారం జంతర్‌మంతర్ వద్ద పార్టీ నేతలతో కలిసి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ చెలరేగిపోతోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదు. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో లోకేశ్ రెడ్ బుక్ పాలన సాగుతోంది’’ అని జగన్ ఆక్రోశించారు.
Updated Date - Jul 25 , 2024 | 10:33 PM