AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..
ABN, Publish Date - Jun 01 , 2024 | 06:30 PM
జిల్లాలో ఓట్ల కౌంటింగ్(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
విశాఖ: జిల్లాలో ఓట్ల కౌంటింగ్(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు. కౌంటింగ్ కోసం ఏజెంట్లు ఒకసారి లోపలకు వెళ్తే బయటకు రావడానికి వీల్లేదని, అలా వచ్చిన వారిని తిరిగి లోపలికి అనుతించమని స్పష్టం చేశారు. దీనిపై స్థానిక ఆర్వోకి పూర్తి అధికారాలుంటాయన్నారు. "త్రీ టైర్స్ సెక్యూరిటీ ఉంటుంది. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లోపలికి అనుమతించబడవు. భీమిలి నియోజకవర్గానికి 26రౌండ్లు, విశాఖ వెస్ట్ నియోజకవర్గానికి 16 రౌండ్లు ఉంటాయి. కౌంటింగ్ రోజు ఎలాంటి సంబరాలకు అనుమతి లేదు. ఆరో తేదీ వరకూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని" కలెక్టర్ వివరించారు.
భద్రతా ఏర్పాట్లు..
ఈనెల 4న ఓట్ల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పేర్కొ్న్నారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘటనల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున ఒక కంపెనీ ఫోర్స్‌తోపాటు అదనపు బలగాలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి డ్రోన్లు ఎగరవేయకూడదని స్పష్టం చేశారు. ఆ సమయంలో 144సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరైనా అల్లర్లు చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సీపీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా.. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవరించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. మద్యం తాగి కౌంటింగ్ కేంద్రాల లోపలికి వెళ్లకూడదన్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించామన్నారు. ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?
AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
AP politics: మాచర్ల అల్లర్ల కేసులో సీఐ నారాయణస్వామిపై వేటు..
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 06:33 PM