AP News: 'దిశ దివ్యాంగ్ సురక్ష' కు బ్రాండ్ అంబాసిడర్‌గా యూట్యూబర్ హర్ష సాయి
ABN, Publish Date - Jun 08 , 2024 | 10:44 PM
'దిశ దివ్యాంగ్ సురక్ష' కు (Disha-Divyang Suraksha) బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నియమించారు. ఈ మేరకు విశాఖలోని బీచ్ రోడ్డులో వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు(శనివారం) 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు.
విశాఖపట్నం: 'దిశ దివ్యాంగ్ సురక్ష' కు (Disha-Divyang Suraksha) బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నియమించారు. ఈ మేరకు విశాఖలోని బీచ్ రోడ్డులో వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు(శనివారం) 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి, విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు. హర్ష సాయిని 'దిశ దివ్యాంగ్ సురక్ష'కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీపీ నియమించారు.
ఆపదలో ఉన్న దివ్యంగులను కాపాడడానికి 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమాన్ని వైజాగ్ సిటీ పోలీస్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హర్ష సాయి మాట్లాడుతూ.. దివ్యాంగులకు రక్షణ కల్పించడానికి 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమం తీసుకువచ్చినందుకు విశాఖ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో ఉన్న దివ్యాంగులకు 'దిశ దివ్యాంగ్ సురక్ష' ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 'దిశ దివ్యాంగ్ సురక్ష' కు తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సంతోషంగా ఉందని యూట్యూబర్ హర్ష సాయి హర్షం వ్యక్తం చేశారు.
మూడు కోట్ల దివ్యాంగులకు చేరువలో దిశా దివ్యాంగ్: విశాఖ సీపీ రవిశంకర్
ఆపదలో ఉన్న దివ్యంగులను కాపాడటానికి దిశా దివ్యాంగ్ సురక్ష కార్యక్రమం తీసుకువచ్చామని విశాఖ సీపీ రవిశంకర్ (Visakha CP Ravi Shankar) తెలిపారు. భవిష్యత్‌లో సమాజానికి అవసరమయ్యే మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. దిశా దివ్యాంగ్ సురక్ష కార్యక్రమం దేశంలో ఉన్న మూడు కోట్ల దివ్యాంగులకు చేరువవుతుందని ఆశిస్తున్నామని సీపీ రవిశంకర్ పేర్కొ్న్నారు.
Updated Date - Jun 08 , 2024 | 10:44 PM