YCP: మాజీ వైసీపీ ఎంపీకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ABN, Publish Date - Jun 26 , 2024 | 10:19 AM
విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ (YCP Ex MP) ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హయగ్రీవ సంస్థ (Hayagriva organization) భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై కేసును కొట్టేయాలని కోరుతూ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హై కోర్టు స్పష్టం చేస్తూ.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
కాగా.. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని, విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న ఆయనపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోపక్క, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..
టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..
కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..
లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 26 , 2024 | 10:19 AM