ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: అయ్యో పాపం.. ఆ తండ్రి కష్టం పగవాడికి కూడా రావొద్దు...!

ABN, Publish Date - Apr 10 , 2024 | 10:58 AM

Andhrapradesh: రోడ్డు మార్గం సరిగా లేని ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి వర్ణణాతీతం. ఎలాగోలా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకోవాలని కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటారు. అయితే అదృశ్యం బాగుండి వారు ప్రాణాలతో బయటపడితే సంతోషం. అదే తీవ్ర అనారోగ్యంతో మరణిస్తే కుటుంబసభ్యుల బాధ చెప్పరానిది. అయితే చనిపోయిన వారిని తమ స్వంత గ్రామాలకు తీసుకెళ్లడమే వీరిక ఒక సవాల్‌గా ఉంటుంది. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో వావహనాలు వెళ్లే దారి లేక... చనిపోయిన వారిని భుజాల మీదే మోసుకెళ్తుంటారు. ఇలాంటి హృదయ విదారక ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

అల్లూరు జిల్లా, ఏప్రిల్ 10: రోడ్డు మార్గం సరిగా లేని ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి వర్ణణాతీతం. ఎలాగోలా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకోవాలని కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటారు. అయితే అదృశ్యం బాగుండి వారు ప్రాణాలతో బయటపడితే సంతోషం. అదే తీవ్ర అనారోగ్యంతో మరణిస్తే కుటుంబసభ్యుల బాధ చెప్పరానిది. అయితే చనిపోయిన వారిని తమ స్వంత గ్రామాలకు తీసుకెళ్లడమే వీరిక ఒక సవాల్‌గా ఉంటుంది. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో వావహనాలు వెళ్లే దారి లేక... చనిపోయిన వారిని భుజాల మీదే మోసుకెళ్తుంటారు. ఇలాంటి హృదయ విదారక ఘటన అల్లూరు జిల్లాలో (Alluri District) చోటు చేసుకుంది. మృతి చెందిన మూడేళ్ల కుమారుడిని తండ్రి భుజంపై వేసుకొని రెండు కొండలు ఎక్కి దిగుతూ 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అందరినీ కలిచివేసింది.

Chennai: అయ్యో ఎంత పనైందే.. చిలుక జోస్యుడి అరెస్టు.. అసలు విషయం ఏంటో తెలిస్తే...


ఇదీ సంగతి..

ఆదివాసి గిరిజన దంపతులు కొత్తయ్య, సీత అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ చిన్నకోనెల గ్రామంలో నివాసం ఉంటున్నారు. పొట్టకూటి కోసం దంపతులు గుంటూరులో ఇటుక బట్టీల పనులకు వెళ్తుంటారు. వీరికి ఇద్దరు కుమారు. చిన్న కుమారుడు ఈశ్వరరావు(3) అస్వస్థతకు గురవడంతో ఇటుక బట్టీల వ్యాపారి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈశ్వరరావు మృతి చెందారు. దీంతో బాలుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో విజయనగరం జిల్లా మెంటాడ వద్ద వనిజ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది.. వారిని వనిజ వద్ద వదిలేసి వెళ్లారు. అక్కడ నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక కుమారుడు శవాన్ని తండ్రి కొత్తయ్య భుజంపై వేసుకొని రెండు కొండలు ఎక్కి ఇంటికి చేరారు.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..


న్యాయం చేయాలి..

విషయం తెలిసిన ప్రజా సంఘాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి లేదంటూ సర్కార్‌పై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

BRS: బీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు.. ఏడాది క్రితమే చెప్పినా..

AP Election 2024: మా అడ్డాకి ఎవడు పంపించాడ్రా!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 10 , 2024 | 11:01 AM

Advertising
Advertising