ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం

ABN, Publish Date - Sep 14 , 2024 | 08:21 PM

విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. లిథియం బ్యాటరీ అన్‌లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్‌లోని ఒక బాక్స్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

విశాఖపట్నం: విశాఖ కంటైనర్ టెర్మినల్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ టెర్మినల్ అప్రమత్తమైంది. త్వరితగతిన విశాఖ పోర్టు ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టడంతో అగ్ని ప్రమాదం తప్పింది. పొగలు వ్యాప్తించిన కంటైనర్‌లోని ఒక బాక్సులో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది.


ALSO READ:Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

విశాఖపట్నం బీచ్ రోడ్డులోని వీసీటీపీఎల్‌లో లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ మేరకు విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం లిథియం బ్యాటరీ అన్‌లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్‌లోని ఒక బాక్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. పొగలు వ్యాపించడంతో సంబంధిత అధికారులు పోర్టు ఫైర్ విభాగం అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.


ALSO READ::Pawan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

మొదట పొగ రావడంతో అప్రమత్తమైన సంబంధిత టెర్మినల్ సిబ్బంది ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరితగతిన పోర్టు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని పోర్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చైనా నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన కంటైనర్ లోడ్ గత నెల 28వ తేదీన విశాఖపట్నానికి చేరిందని పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసి పోర్టు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..

Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 14 , 2024 | 08:56 PM

Advertising
Advertising