ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన రోగులు..

ABN, Publish Date - Jul 30 , 2024 | 08:34 AM

వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి సెల్లార్‌లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో విద్యుత్ షార్ట్ సర్యూట్ అయ్యింది. దీంతో సెల్లార్ సహా మెుదటి అంతస్తు వరకు పొగ వ్యాపించింది.

విశాఖ: వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి సెల్లార్‌లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో విద్యుత్ షార్ట్ సర్యూట్ అయ్యింది. దీంతో సెల్లార్ సహా మెుదటి అంతస్తు వరకు పొగ వ్యాపించింది. ఒక్కసారి పొగలు రావడంతో ఆందోళనకు గురైన రోగులు, బంధువులు హాస్పటల్ నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు.


పొగలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక వారంతా అయోమయానికి గురయ్యారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరికొన్ని ఫోర్లకు పొగ వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. సెల్లార్‌లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో పరిస్థితిని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం స్పందన..

ఘటనపై మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. భవనంలోని బ్యాటరీల మెయింటనెన్స్ రూమ్‌లో అగ్నిప్రమాదమే పొగలు వ్యాపించడానికి కారణం అని హాస్పిటల్ సెంటర్ హెడ్ పద్మజా తెలిపారు. మంటలు రాలేదని కేవలం పొగ మాత్రమే వ్యాపించిందని ఆమె వెల్లడించారు. ప్రమాదంలో రోగులు, సిబ్బంది ఎవరికీ ఏం కాలేదని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారని.. ఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలు వ్యాపించకుండా, పొగను అదుపులోకి తెచ్చారని చెప్పారు.

Updated Date - Jul 30 , 2024 | 08:34 AM

Advertising
Advertising
<