ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం

ABN, Publish Date - Mar 24 , 2024 | 10:49 AM

విశాఖ: భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు.

విశాఖ: భీమిలీ (Bhimili) నియోజకవర్గంలో వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు (Avanthi Srinivasarao)కు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు (womens), యువకులు (Youth) అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు. దీంతో అవంతి బిత్తరపోయారు. ప్రశ్నిస్తున్న వారిని అవంతి అనుచరులు నోరు నొక్కే ప్రయత్నం చేశారు. తన భూమి పోయిందని ఒక యువకుడు అవంతికి చెబుతుండగా... అవంతి అనుచరులు అడ్డుకొని.. పక్కకు తోసేశారు. తన భూమి కోసం అడుగుతా..నన్ను ఎందుకు తోసేస్తున్నారని బాధితుడు ప్రశ్నించాడు. పట్టు వదలకుండా అవంతిని పదేపదే ప్రశ్నిస్తున్న యువకుడిని అక్కడ నుంచి అవంతి అనుచరులు ఈడ్చుకుంటూ తీసుకుపోయారు. స్థానిక మహిళలు, యువకులు గట్టిగా నిలదీయడంతో ప్రచారాన్ని ముగించి అవంతి శ్రీనివాసరావు వెళ్లిపోయారు. భీమిలీ నియోజక వర్గంలో నిన్న (శనివారం) ఎన్నికల ప్రచారాన్ని అవంతి శ్రీనివాసరావు నిర్వహించారు.

Updated Date - Mar 24 , 2024 | 10:49 AM

Advertising
Advertising