ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ganta Srinivasarao: జగన్ అర్జునుడు కాదంటూ గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 19 , 2024 | 12:04 PM

Andhrapradesh: ఉత్తర నియోజకవర్గం శంఖారావం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అర్జునుడు కాదు దుర్యోదనుడని.., చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులు అంటూ కామెంట్ చేశారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ఉత్తర నియోజకవర్గం శంఖారావం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan Reddy) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అర్జునుడు కాదు దుర్యోదనుడని.., చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులు అంటూ కామెంట్ చేశారు. ఉమ్మడి 3 జిల్లాల్లో 3 సీట్లు గెలుస్తామని చెప్పే ధైర్యం వైసీపీకి లేదన్నారు. బైబై జగన్ అని చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ - జనసేన కార్యకర్తలను వేధించిన అధికారులు, వైసీపీ మూకలకు రెండు నెలల తర్వాత గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

సీఎంకు గట్టి కౌంటర్

పార్టీ గుర్తులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. టీడీపీ, జనసేన కూటమి రావడం ఖాయమన్నారు. జగన్ ఇక ఇంటిలోనే ఉండి ఫ్యాన్ వేసుకొని రెస్టు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఎద్దేవా చేశారు. సైకిల్ ఎప్పుడూ బయట ఉండి.. ప్రజల మధ్య తిరుగుతుందన్నారు. త్వరలోనే వైసీపీ నేతలు ఫ్యాన్ కింద ఉంటూ విశ్రాంతి తీసుకొని... గాజు గ్లాస్‌లో టీ తాగాల్సి వస్తుందని సెటైరికల్ కామెంట్స్ వేసిరారు.

టీడీపీ - జనసేన కాంబినేషన్ సూపర్ హిట్

ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసాన్ని జగన్ ప్రారంభించారని.. విధ్వంసానికి మారు పేరుగా ఏపీని చేశారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్‌తో ప్రజలను మోసం చేశారన్నారు. 31 ఎంపీలు, 151 ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి వైసీపీ ఏమీ చేయలేక పోయిందన్నారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారని.. ఎమ్మార్వోను కిరాతకంగా చంపేశారన్నారు. విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా చేశారని దుయ్యబట్టారు. ఆముదం చేనులో ఆంబోతు పడినట్లు జగన్ తీరు ఉందన్నారు. జగన్‌కు బై బై చెప్పాలసిన సమయం వచ్చిందన్నారు. మద్యపానం నిషేధం అన్నారన్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్నికల హామీలు చేయడంలో వైసీపీ విఫలం అయ్యారని... దీనిపై చర్చకు రెడీ అంటూ సవాల్ విసిరారు. టీడీపీ - జనసేన కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 12:48 PM

Advertising
Advertising