ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anitha: సినర్జిన్ కంపెనీ బాధితుల నష్ట పరిహారంపై హోంమంత్రి కీలక ప్రకటన

ABN, Publish Date - Aug 26 , 2024 | 01:26 PM

Andhrapradesh: పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం అందజేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కక్కరికి కోటి రూపాయలు పరిహారం అందచేస్తామన్నారు. విశాఖ రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.

Home Minister Vangalapudi Anitha

విశాఖపట్నం, ఆగస్టు 26: పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం అందజేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కక్కరికి కోటి రూపాయలు పరిహారం అందచేస్తామన్నారు. విశాఖ రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Bopparaju Venkateswarlu: నెలకు 54 రూపాయలు ఇస్తే నిర్వహణ ఎలా?


ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం, భరోసా కల్పించారన్నారు. విశాఖ జిల్లాలో జరిగిన రెండు ఘటనలపై హోం మంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించినట్లు అనిత వెల్లడించారు. కాగా... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎసెన్షియ ఫార్మా లో ప్రమాద మృతులకు ఎలాగైతే పరిహారం చెల్లించారో.. అలాగే పరవాడ సెనర్జీస్ మృతులకు కూడా పరిహారం చెల్లించాలని యాజమాన్యంతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఈ క్రమంలో పరవాడ సెనర్జీస్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో చెక్కులను మృతుల కుటుంబాలకు సెనర్జిస్ యాజమాన్యం అందజేసింది.


ఇవి కూడా చదవండి...

Grama Sachivalayam: సచివాలయాల సిబ్బంది సర్దుబాటు!

CM Chandrababu: ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<