మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరలేపిన జగన్ ప్రభుత్వం

ABN, Publish Date - Mar 11 , 2024 | 03:58 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వలంటీర్ల(Volunteers)తో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు.

Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరలేపిన జగన్ ప్రభుత్వం

విశాఖపట్నం: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్‌ రెడ్డి (CM Jagan) పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వలంటీర్లతో(Volunteers) ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు. ప్లాన్‌లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వలంటీర్లతో అక్రమంగా సర్వే చేయిస్తున్నారు. సంక్షేమ పథకాలపై సర్వే పేరిట ఇంటింటికీ వెళ్లి వైసీపీకి వలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల నుంచి అభిప్రాయాల సేకరణ పేరుతో జగన్‌కి ప్రచారం చేస్తున్నారు. వలంటీర్ల ప్రచారంపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగనన్నే మళ్లీ రావాలని బయోమెట్రిక్‌ వేయండి అంటూ హుకుం జారీ చేశారు. ఈ విషయం పసిగట్టిన ప్రజలు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో నిజాయితీగా గెలవాలి కానీ ఇలా అక్రమ మార్గంలో గెలవాలని చూడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు వలంటీర్లకు ఎదురు తిరుగుతుండటంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సర్వే రచ్చ రచ్చ అవుతోంది.

జగన్‌కి అనుకూలంగా ఎందుకు బయో మెట్రిక్ వేయాలని ప్రజలు వలంటీర్లను నిలదీస్తున్నారు. నెలనెలా పెన్షన్, అమ్మ ఓడి, చేయూత, తదితర పథకాల ద్వారా లబ్ధి పొందారు కదా? ఎందుకు బయో మెట్రిక్ వేయరని వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, నిత్యావసర వస్తువుల ధరలు అన్నింటిని పెంచే కదా? తమకు డబ్బులు ఇస్తున్నారని ఊరికే ఏమి ఇవ్వడం లేదు కదా అని ప్రజలు వలంటీర్లను నిలదీస్తున్నారు. జగన్‌కి అనుకూలంగా బయోమెట్రిక్ వేయని వారిని వలంటీర్లు బెదిరింపులకు గురి చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అన్నీ రద్దు అయిపోతాయని హెచ్చరిస్తున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని ప్రజలు తేల్చిచెప్పడంతో వలంటీర్లు అక్కడి నుంచి మెల్లగా జారుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

Lokesh: జగన్ బిల్డప్ బాబాయి... డ్రోన్ చూసి భయపడ్డాడు

AP Highcourt: వైఎస్ షర్మిల, సునీతలపై ఫేక్‌పోస్టు పెట్టారని మోపిన కేసుపై హైకోర్టులో విచారణ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 04:29 PM

Advertising
Advertising