Kollu Ravindra: మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..
ABN, Publish Date - Oct 29 , 2024 | 10:14 AM
Andhrapradesh: మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్‌ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 29: సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం, బేడ మండపం ప్రదక్షిణ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని మంత్రికి ఆలయ అధికారులు అందజేశారు.
ఉచిత సిలిండర్లకు 895 కోట్ల రాయితీ
దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ... సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్‌ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్‌ను నాలుగువేలు ఇస్తున్నామన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖున లబ్ధిదారులు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని.. ఒకటో తేదీ ఆదివారం పడితే 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు దీపావళి కానుకగా ఇవాల్టి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు బుకింగ్ మొదలుకానుందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులనుఉపయోగించుకుంటూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధికి పరచడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని మంత్రి కొల్లురవీంద్ర పేర్కొన్నారు.
Viral Video: వామ్మో.. వాహనాలు గాల్లోకి ఎలా ఎగురుతున్నాయో చూడండి.. కారణం ఏంటో తెలిస్తే..
నేటి నుంచే బుకింగ్స్...
మరోవైపు ప్రజలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందించడానికి ప్రభుత్వంపై రూ. 2,684.75 కోట్ల రాయితీ భారం పడుతుందని పౌరసరఫరాలశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తొలివిడత వంట గ్యాస్ సిలిండర్లను పొందే లబ్ధిదారులకు చెల్లించాల్సిన రాయితీ మొత్తం రూ.895 కోట్ల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ రాయితీ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ కంపెనీల అకౌంట్లకు ముందుగానే మళ్లిస్తారు. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే లబ్ధిదారులు నేటి (మంగళవారం) నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇవి కూడా చదవండి...
ప్రభుత్వం మాది.. నీ అంతు చూస్తా
వాళ్లందరినీ ముక్కలుగా నరికేస్తాం: మిథున్
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 29 , 2024 | 01:13 PM