ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganta: చంబల్ దేవీ తర్వాత అత్యధిక కేసులు జగన్‌పైనే

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:41 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

MLA Ganta Srinivas Rao

విశాఖపట్నం, నవంబర్ 1: దీపావళి అంటే చెడుపైన మంచి విజయం అని.. వైసీపీపై కూటమి విజయం అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈరోజు (శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Cm Pawan Kalyan) పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్స్ ఇవ్వగలిగామని.. గతంలో దీన్ని వైసీపీ రాజకీయం చేసిందని విమర్శించారు.

Drug Case: చందానగర్ డ్రగ్స్ కేసు.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి


తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. విజయమ్మ లేఖతో పార్టీ పూర్తిగా మునిగిపోయిందని.. ఆ పార్టీలో జగన్ (Former CM YS Jaganmohan Reddy) తప్పితే ఎవరు మిగలరన్నారు. అన్ని వ్యవస్థలు నాశనం చేసిన ప్రభుత్వం వైసీపీ అంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ పాజిటివ్ దృక్పథంగా వెళుతున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. 2004 లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 92 లక్షల రూపాయలు ఉన్నాయి..2009 నాటికి రూ.370 కోట్లకు వెళ్లారని తెలిపారు.

KTR: కేటీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ వ్యాప్తంగా


జగన్ మీద 47 కేసులు ఉన్నాయని.. చంబల్ దేవి తర్వాత అత్యధిక కేసులు ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీదనే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు అన్న క్యాంటీన్లు మూసివేశారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రారంభించామన్నారు. భీమిలి నియోజకవర్గ నాయకులు, శుభకార్యాల రోజు నాడు ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేస్తున్నాన్నామన్నారు. జిల్లా సమీక్షలో భీమిలికి సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి.. ఇచ్చిన హామీలు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటుపరం జరగదని. అవసరమైతే ఢిల్లీ వెళ్లి మాట్లాడతామని వెల్లడించారు. రుషి కొండ విషయంలో ఏం చేయాలనే దానిపైన త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Lokesh: అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్

AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ

Read latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 01:49 PM