ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: విజయసాయిరెడ్డి కుమార్తె కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. హైకోర్టు ఆరా..

ABN, Publish Date - Oct 24 , 2024 | 12:21 PM

విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..

విశాఖ జిల్లా: భీమిలిపట్నం పరిధిలో కోస్టల్ రెగ్యులేషన్‌ జోన్‌‌లో (Coastal Regulation Zone) నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వైసీపీ ఎంపీ (YCP MP) విజయసాయి రెడ్డి (Vijayasaireddy) కుమార్తె నెహారెడ్డి (Neha Reddy).. ఇతర బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) అధికారులను ఏపీ హైకోర్టు (AP High Court) ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. అని ఆరా తీసింది. వివరాలతో నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం సముద్రానికి అతి సమీపంలో చేపట్టిన శాశ్వత నిర్మాణాలను తొలగించాలని జీవీఎంసీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం నిన్న మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు.


కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారు. ఉల్లంఘనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరస కథనాలు ప్రసారం అయ్యాయి. నేహా రెడ్డి సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నేహా రెడ్డికి సెప్టెంబర్ 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని.. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కాంక్రీట్ గోడను నిర్మించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ వేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని గత నెలలో హైకోర్టు నిర్దేశించి ఆపై తదుపరి విచారణను సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. భీమిలి బీచ్‌ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ తరఫున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్‌ వాదనలు వినిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు

ఆందోళనలో రేవంత్ రెడ్డి సర్కార్..

ఉగ్రవాదంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..

రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 24 , 2024 | 12:21 PM